ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వరద బాధితులకు విరాళాల వెల్లువ - భారత్‌ బయోటెక్‌ రూ. కోటి, నందమూరి మోహనకృష్ణ, మోహన రూప రూ.25 లక్షలు - Donations to AP CMRF - DONATIONS TO AP CMRF

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2024, 10:07 PM IST

Bharat Biotech and Nandamuri Mohana Krishna Donations to CMRF : విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. ఆపదలో ఉన్న బాధితుల్ని ఆదుకునేందుకు కోటిరూపాయల సహాయం ప్రకటించిన భారత్‌ బయోటెక్‌, ఆ మొత్తాన్ని సీఎంను కలిసి అందజేసింది. భారత్ బయోటెక్ MD సుచిత్ర ఎల్లా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కోటి రూపాయల చెక్కు అందజేశారు. మరోవైపు నందమూరి మోహనకృష్ణ, ఆయన కుమార్తె మోహన రూప కూడా చంద్రబాబుకు రూ. 25 లక్షలు విరాళం అందజేశారు. దాతలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

సామాజిక బాధ్యతతో విజయవాడ వరద బాధితులకు నూజీవీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అండగా నిలిచారు. 1565 మంది విద్యార్థులు, అలాగే పూర్వ విద్యార్థులు మంత్రి లోకేశ్​ను కలిసి విరాళమిచ్చారు. యోగా గురువు శ్రీధర్ ఆధ్వర్యంలో 2 లక్షల 82 వేల రూపాయల చెక్కును లోకేశ్ కు అందజేశారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు విరాళం అందజేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. వరద బాధితులకు ఇంతమంది అండగా నిలవడం చాలా గొప్ప విషయమని లోకేశ్ ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details