ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఉపాధిహామీ కార్మికుడు మృతి - పనులు చేస్తుండగా తేనెటీగలు దాడి - Bee Attack Old Man - BEE ATTACK OLD MAN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 25, 2024, 2:44 PM IST

Bee Attack Old Man Died in YSR District : ఉపాధి హామీ పనికి వెళ్లిన ఓ కార్మికుడిపై తేనెటీగలు దాడి చేసిన సంఘటన వైఎస్సార్​ జిల్లా చోటుచోసుకుంది. ఈ దాడిలో ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కమలాపురం మండలం జమ్మాపురం పంచాయతీకి చెందిన గంగిరెడ్డి (60) తేనెటీగల దాడిలో మృతి చెందారు. ఉదయం ఉపాధి కూలీకి వెళ్లిన గంగిరెడ్డి కాల్వ పని చేస్తున్న సమయంలో పక్క ఉన్న తేనెటీగలను గమనించలేదు. దీంతో తేనెటీగలు ఒకసారి ఆయనపై దాడి చేశాయి.

తేనెటీగల దాడికి గంగిరెడ్డి భయపడి బీపీతో స్పృహ కోల్పోయారు. దీంతో స్థానికులు గంగిరెడ్డిని 108 ద్వారా కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్​ రెడ్డి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఉపాధి హామీ విధుల్లో భాగంగా మృతి చెందిన గంగిరెడ్డి కుటుంబానికి రూ.50 వేలు ఎక్స్ ​గ్రేషియా వస్తుందని ఏపీవో పార్థసారథి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details