ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బల్ల గుద్దగలను-బరువులెత్తగలను! అబ్బురపరుస్తున్న మహిళ విన్యాసాలు - Lawyer Kumarinanda As weight lifter - LAWYER KUMARINANDA AS WEIGHT LIFTER

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 1:29 PM IST

Gold medal for Bapatla lawyer in Weight lifting:రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బాపట్ల జిల్లా, అద్దంకి నియోజకవర్గం, సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన న్యాయవాది సత్తా చాటారు.ఏకంగా ఒకేసారి బంగారు, రజత పతకాలు సాధించి ఓౌరా అనిపించారు.

 ఈ నెల సెప్టెంబర్ 14, 15 తేదీల్లో అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన 11వ రాష్ట్ర స్థాయి అన్ ఎక్యూపుడ్ పవర్ లిఫ్టింగ్, బెంచ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో న్యాయవాది కుమారినంద ఈ  అరుదైన ఘనతను సాధించారు. సీనియర్స్ మహిళా విభాగంలో జిల్లా తరపున 76 కిలోల విభాగంలో పోటీ పడి బెంచ్ బంగారు పతకం సాధించి మరీ ఛాంపియన్ గా నిలిచారు. తరువాత అన్ ఎక్యూపుడ్ పవర్ లిఫ్టింగ్ విభాగంలో 265 కిలోల బరువును సునాయాసంగా ఎత్తి మరో రజత పతకాన్ని తన ఖాతాలో  వేసుకున్నారు. ఈ ఘనతతో కుటుంబ సభ్యులు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. అటు గ్రామస్తులు కూడా కుమారినందాకు అభినందనలు తెలియజేశారు. 

ABOUT THE AUTHOR

...view details