ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

హిందుపురంలో బాలకృష్ణ సతీమణి ఎన్నికల ప్రచారం - భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థన - Vasundhara Campaign in Hindupur - VASUNDHARA CAMPAIGN IN HINDUPUR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 4:52 PM IST

Balakrishna Wife Vasundhara Election Campaign in Hindupur: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ సతీమణి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి సూపర్‌ సిక్స్‌ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల నోటి దగ్గరి అన్నాన్ని లాగేసుకుందని మండిపడ్డారు. హిందూపురం ప్రజల శ్రేయస్సు కోసం బాలకృష్ణ సొంత నిధులతో అన్న క్యాంటీన్ ద్వారా పేద ప్రజల కడుపు నింపారని వసుంధర పేర్కొన్నారు. కరోనా సమయంలో పేదలకు ఉచిత వైద్యం అందించామని గుర్తు చేశారు. 

గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి రూ.193 కోట్ల రూపాయలతో ప్రత్యేక పైప్ లైన్ ద్వారా హిందూపురం ప్రజల కోసం బాలకృష్ణ తాగునీరు అందించారని వసుంధర అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎన్టీఆర్ ఆరోగ్య రథం ద్వారా గ్రామాల్లోని ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు.

ABOUT THE AUTHOR

...view details