ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్' శిబిరాన్ని సందర్శించిన బాలకృష్ణ- పేదలకు వైద్య సేవలు కొనసాగిస్తామని ప్రకటన - క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 3, 2024, 10:54 PM IST

Balakrishna Visit Then Cancer Screening Mobile Vehicle: పేదలు వ్యాధి నిర్థరణ పరీక్షల నిమిత్తం ఖర్చులు భరించలేని వారికి బసవతారకం క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనం ద్వారా ఆరోగ్య సేవలు అందించడం ఆనందం ఉందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన 'ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్' వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అత్యాధునిక పరికరాలతో ఈ వాహన వైద్య సేవలు పేద ప్రజలకు అండగా నిలుస్తాయన్నారు. 

వైద్యసేవల గురించి అక్కడ ఉన్న డాక్టర్లు, సాంకేతిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. యాదృచ్ఛికంగా మొబైల్ వాహన వైద్య సేవలు హిందూపురంలో ప్రారంభం కావడమనేది చాలా సంతోషంగా ఉందన్నారు. హిందూపురం అనగానే మొదట గుర్తుకు వచ్చేది తండ్రి నందమూరి తారక రామారావు, తల్లి బసవ రామతారకం అని బాలయ్య అన్నారు. చికిత్స కోసం వచ్చిన వారిని పేరుపేరున ఆప్యాయంగా పలకరించారు. వారి ఆరోగ్య సమస్యలు గురించి అడిగి తెలుసుకుని ధైర్యంగా ఉండాలని బాలకృష్ణ భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details