ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చెల్లి భువనేశ్వరికి చిరుముద్దుతో ఆశీర్వదించిన బాలయ్య- చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆసక్తికర సన్నివేశం - Balakrishna kiss to Bhuvaneshwari

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 12, 2024, 3:31 PM IST

Balakrishna kiss to Bhuvaneshwari at Chandrababu Swearing Ceremony : ఏపీ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణస్వీకార మహోత్సవంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చంద్రబాబు పట్టాభిషేకానికి ఆయన సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు. వేదికపైకి చేరుకున్న ఆమె సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భువనేశ్వరి వద్దకు వచ్చి ఆశీర్వచనం అందించారు. చెల్లిని పలకరించి ఆత్మీయంగా నుదుటిపై ముద్దు పెట్టారు. ఈ దృశ్యాన్ని చూసిన వేదిక ముందు ప్రజలంతా జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra babu) నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. చంద్రబాబుతో పాటు మరో 24 మంది చేత గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, నితిన్‌ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్‌ దంపతులు, రామ్‌చరణ్‌ తదితరులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details