ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రా కదలిరా సభలో చంద్రబాబుకు తప్పిన ప్రమాదం - TDP Sabha

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 5:30 PM IST

Babu Slips in Ra Kadali Ra Party Meeting: రాజమహేంద్రవరం "రా కదలిరా" బహిరంగ సభ ముగింపు సమయంలో చంద్రబాబు పడిపోయే పరిస్థితి తలెత్తింది. అభిమానులు, పార్టీ నేతలు చంద్రబాబు వద్దకు పెద్ద ఎత్తున నెట్టుకురాగా ఆయన పడిపోబోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఇతర నేతలు ఆయన కిందపడకుండా పట్టుకున్నారు. ఆయన చుట్టూ వలయంగా ఏర్పడి క్షేమంగా వేదికపై నుంచి కిందకు తీసుకొచ్చారు.

Chandra Babu In Rajamundry: వైఎస్సార్సీపీలో తిరుగుబాటు మొదలైందని, జగన్​ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజమహేంద్రవరంలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. పన్నుల బాదుడుతో పేదల రక్తాన్ని తాగుతున్నారని బాబు నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీని భూస్థాపితం చేయాలని ఓటర్లకు చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ అధికారం చేపట్టిన తరువాత ఉద్యోగ ఖాళీల భర్తీపై ఏనాడూ శ్రద్ధ పెట్టలేదని విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఆకు కూరలు దొరకడం లేదు గానీ గంజాయి దొరుకుతోందని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details