తెలంగాణ

telangana

ETV Bharat / videos

బైక్​ను తప్పించబోయి ఆటో బోల్తా - మహిళ మృతి, ముగ్గురికి గాయాలు - Road Accident In Hyderabad - ROAD ACCIDENT IN HYDERABAD

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 2:31 PM IST

Road Accident In Raidurgam : హైదరాబాద్​లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్​ను తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రత్నాబాయ్ అనే మహిళ మృతి చెందగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అటు వైపుగా వస్తున్న బైక్​ను తప్పించబోయి ముందు ఆగి ఉన్న వ్యానును ఢీకొని బోల్తా పడిందని రాయదుర్గం పోలీసులు తెలిపారు. 

గమనించిన స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆటోలో డ్రైవర్ జితేందర్, చంద్రకళ, వేణు, రత్నాబాయ్ ఉన్నారు. ఈ ప్రమాదంలో రత్నాబాయ్ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇటీవల కాలంలో నగరంలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పోలీసులు కోరుతున్నప్పటికీ వినకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.  

ABOUT THE AUTHOR

...view details