LIVE: అచ్యుతాపురం ప్రమాదం - ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స - ప్రత్యక్ష ప్రసారం - Atchutapuram SEZ Blast - ATCHUTAPURAM SEZ BLAST
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 22, 2024, 9:22 AM IST
|Updated : Aug 22, 2024, 11:48 AM IST
Atchutapuram SEZ Pharma Company Incident Live: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 17 మంది మృతి చెందగా, మరో 40 మందికి గాయాలు అయ్యాయి. అచ్యుతాపురం ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో పేలుడు చోటుచేసుకుంది. రియాక్టర్‌లోని మిశ్రమం ఎలక్ట్రికల్ ప్యానల్‌పై పడటంతో మంటలు చేలరేగినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. క్షతగాత్రులకు అనకాపల్లి, విశాఖలోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో అతిపెద్ద ప్రమాద ఘటన ఇదే. నేడు సీఎం చంద్రబాబు అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఫార్మా కంపెనీ ఘటనలో మృతుల కుటుంబాలకు పరామర్శించున్నారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్న సీఎం, ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఘటనపై ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సీఎం మాట్లాడుతున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, తక్షణం క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్ తరలించాలన్నారు. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని ఆదేశించారు. ప్రస్తుతం అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీ దగ్గర నుంచి ప్రస్తుత పరిస్థితిపై ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Aug 22, 2024, 11:48 AM IST