తెలంగాణ

telangana

ETV Bharat / videos

తాగనేలేదు, పరీక్ష ఎలా చేస్తారు - పోలీసులతో లాయర్ వాగ్వాదం - Fight Between Lawyer And police

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 4:06 PM IST

Argument Between Lawyer And police in Kamareddy : డ్రంక్​ అండ్ డ్రైవ్ నిర్వహించే సమయంలో ఓ న్యాయవాది పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా కేంద్రం హౌసింగ్​ బోర్డు కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి డీఎస్పీ ప్రకాష్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్  తనిఖీలు నిర్వహించారు. అదే పట్టణానికి చెందిన సుజిత్​ గౌడ్​ అనే న్యాయవాది బైక్​ను పోలీసులు ఆపి తనని టెస్టు చేయాలని పోలీసులు అతనికి సూచించారు. దీంతో తాను మద్యం తాగలేనని తనకు మద్యపానం పరీక్ష ఎలా చేస్తారని పోలీసులతో గొడవకు దిగాడు. 

ఆపై పోలీసులే తన వద్దకు వచ్చి, తాను తాగకున్న, అనుమతి లేకుండా ఫోన్​లో వీడియోలు చిత్రీకరించి, దాడి చేశారని ఆరోపించారు. బ్రీత్ ఎనలైజర్​కు సహకరించకపోవడంతో పోలీస్​ వాహనంలో వైద్య పరీక్షల నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా​ వైద్య పరీక్షలను నిరాకరించడంతో మళ్లీ పోలీసులకు, అతనికి వాగ్వాదం చోటుచేసుకుంది. సుమారు రెండున్నర గంటల పాటు ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు సుజిత్​ను దేవునిపల్లి స్టేషన్​కు తరలించారు.  

ABOUT THE AUTHOR

...view details