ఏపీఎస్ఆర్టీసీ మరో ప్రతిష్టాత్మక ఘనత - నగదు రహిత లావాదేవీల్లో జాతీయస్థాయి అవార్డు - APSRTC Got National Level Award - APSRTC GOT NATIONAL LEVEL AWARD
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2024, 12:51 PM IST
APSRTC Got National Level Award : ఎపీఎస్ ఆర్టీసీ మరో అరుదైన స్థానాన్ని దక్కించుకుంది. జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక అవార్డును సాధించి ఔరా అనిపించుకుంది. గవర్నెన్స్ నౌ 9వ పి.ఎస్.యూ ఐటీ అవార్డు -2024ను తన ఖాతాలో వేసుకుంది.
అవార్డును సాధించేందుకు దోహదపడిన అంశాలు: యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీ (Cashless transactions) లు, కాగిత రహిత టికెట్ల జారీ చేయడంతో సహా బస్సుల్లో డిజిటల్ టికెట్ల జారీ, అన్ని బస్సుల్లో ట్రాకింగ్ ఏర్పాటు చేసినందుకు ఈ అవార్డుకు ఎంపికైంది. దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఐటీ చీఫ్ ఇంజినీర్ వి.సుధాకర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సేవలను మరింత విస్తృతం చేసే విధంగా అడుగులు వేస్తామని తెలియజేశారు. ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. అన్ని రకాల వయసుల వారినీ దృష్టిలో ఉంచుకుని సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.