LIVE : విజయవాడలో వైఎస్ షర్మిల మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - SHARMILA IN VIJAYAWADA LIVE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2024, 3:13 PM IST
|Updated : Oct 26, 2024, 3:59 PM IST
YS Sharmila Live : వైఎస్సార్సీపీపై, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌పై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. వైఎస్సార్సీపీ విశ్వసనీయత కోల్పోయిందని ఆ పార్టీలో జగన్ తప్ప ఎవరూ మిగలరని విమర్శించారు. వైఎస్సార్ మంచి పేరు సాధిస్తే కేవలం ఒక్కసారి సీఎం అయిన జగన్ చెడ్డపేరు సాధించారని తెలిపారు. వైఎస్సార్‌కి జగన్‌కు పొంతనే లేదన్నారు. వైఎస్సార్సీపీ పార్టీ ఇక అంతం అయినట్లేనని షర్మిల అన్నారు. చివరికి వైఎస్సార్సీపీ చుట్టూ ఉన్న విజయసాయిరెడ్డి, సజ్జల కూడా పార్టీలో ఉండరన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంపాదించిన ఆస్తుల్లో తనకు, తన పిల్లలకు దక్కాల్సిన వాటా ఇవ్వకుండా సోదరుడు జగన్ తమకు అన్యాయం చేశారని వైఎస్ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర ఆస్తులు ఇచ్చి వెళ్లగొట్టాలని చూడటమే కాకుండా, పంపకాలపై చేసుకున్న ఒప్పందాన్నీ తుంగలో తొక్కారని మండిపడ్డారు. తల్లిపైనా, చెల్లిపైనా కేసు పెట్టి, కుటుంబాన్ని కోర్టుకీడ్చేంత నీచానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తుల విషయం సెటిల్ చేసుకోవాలంటే జగన్‌కు, అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని తనకు షరతు పెట్టడం ఏంటి అంటూ ఆమె జగన్‌కు గట్టి బదులిచ్చారు. తాజాగా విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిల పాల్గొన్నారు.
Last Updated : Oct 26, 2024, 3:59 PM IST