ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

త్వరలోనే మహిళలకు ఉచిత ప్రయాణం - మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి - AP Transport Minister interview - AP TRANSPORT MINISTER INTERVIEW

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 10:19 AM IST

Minister Mandipalli Ramprasad Reddy interview: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు త్వరలోనే ఉచిత ప్రయాణం కల్పిస్తామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అంతకు ముందే ఆర్టీసీ బస్సుల కండిషన్‌ మెరుగుపరచాలని, బస్టాండ్లలోని సమస్యలను పరిష్కరించాలని ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన అడ్డగోలు విధానాలతో ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులు కష్టాలు పడ్డారని, వీటన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. ఆర్టీసీలో అక్రమ సస్పెన్షన్లు, వేధింపుల మాటే వినిపించకుడదని అధికారులకు స్పష్టం చేశారు. 

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను పరిష్కరించి, వారికి మెరుగైన సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్  తెలిపారు. ఆర్టీసీలో ప్రమాదాల నివారణకు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని, దూర ప్రాంతాలకు నడిచే బస్సుల సంఖ్య పెంచుతామని, కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు కొని, సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఉద్యోగులు, ప్రయాణికుల తమ ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటి వారని, వారి కష్టాలు తీర్చి ఆర్టీసీ సంస్థ మనుగడను కాపాడుతామన్నారు. ప్రయాణికులకు సురక్షిత ప్రయాణాన్ని అందించే అన్ని చర్యలు తీసుకుంటామంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details