ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న వైఎస్​ షర్మిల- ప్రత్యక్ష ప్రసారం - AP PCC Chief Sharmila Live

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2024, 12:06 PM IST

AP PCC Chief Sharmila Live: అధికార వైఎస్సార్​సీపీపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల విమర్శల పర్వం కొనసాగుతోంది. పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుంచి వివిధ జిల్లాలో పర్యటనలు చేస్తున్న ఆమె, శనివారం ప్రకాశం జిల్లాలో కార్యకర్తల సమావేశంలో వైఎస్సార్సీపీ​​పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్సార్సీపీ పార్టీకి షర్మిల కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. ఆ పార్టీ పేరుకు గతంలో ఉన్న అర్థం వేరని, ఇప్పుడున్న అర్థం వేరంటూ విమర్శించారు. ఇప్పుడున్న వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీలో వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి లేరని, వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్​ అంటే సాయిరెడ్డి, ఆర్​ అంటే రామకృష్ణారెడ్డి మాత్రమేనని ఆమె అభివర్ణించారు.

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో విష్ణుప్రియ ఫంక్షన్‌ హాలులో శనివారం కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పీసీసీ చీఫ్​ షర్మిల పాల్గొనగా, సీనియర్‌ నాయకులు రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజుతో పాటు పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. పులి కడుపునా పులే పుడుతుందని, తనలో ప్రవహిస్తోంది వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి రక్తమని షర్మిల అన్నారు. రాజశేఖర్​ రెడ్డి కుమార్తెగా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చానని, తనను ఎవరూ ఏం చేయలేరని ఆమె తేల్చి చెప్పారు. కాగా ఈరోజు తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న షర్మిల ప్రత్యక్షప్రసారం.

ABOUT THE AUTHOR

...view details