బాస్ ఈజ్ బ్యాక్ - ఆనందంలో ఎన్ఆర్ఐలు సంబరాలు - NRI Celebrations in Vijayawada - NRI CELEBRATIONS IN VIJAYAWADA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 4, 2024, 5:21 PM IST
AP NRI Celebrations in Vijayawada : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు భారీ సంఖ్యలో విజయం సాధించడం వల్ల పార్టీ శ్రేణుల్లో సంబరాలు హోరెత్తాయి. రాష్ట్రంలో పలు చోట్ల బాణసంచా కాలుస్తూ విజయోత్సాహంలో మునిగి తెలుతున్నారు. కలలో కూడా ఊహించని విధంగా విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ క్రమంలోనే ఎన్ఆర్ఐలు ఎన్నికల ఫలితాలపై సంబరాలు చేసుకున్నారు.
Election Result Celebrations : మే 13న జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధిక మెజార్టీటీ సాధించడంతో ఎన్ఆర్ఐలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. చంద్రబాబు నాయుడితో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వం రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీలో ఇంకా మంచి రోజులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు చరిత్ర సృష్టించారని వ్యాఖ్యానించారు.