LIVE : ఏపీ శాసనమండలి సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - AP LEGISLATIVE COUNCIL
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 14, 2024, 11:34 AM IST
|Updated : Nov 14, 2024, 2:01 PM IST
AP Legislative Council Session Live : విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కేసులపై శాసన మండలిలో బుధవారం స్వల్ప వాగ్వాదం జరిగింది. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్య నారాయణ (Botsa Satya Narayana) చేసిన విమర్శలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) తిప్పికొట్టారు. ప్రభుత్వం తరఫున ఇంకా పర్యవేక్షణ లోపం ఉందని బొత్స ఆరోపించారు. మృతుల విషయంలో స్పష్టత లేదని అన్నారు.అనంతరం అచ్చెన్నాయుడు స్పందిస్తూ గత ఐదు సంవత్సరాలల్లో వాటర్ ట్యాంక్లలో పిడికెడు బ్లీచింగ్ కూడా వేసిన సందర్భాలు లేవని అన్నారు. పంచాయతీలకు పైసా నిధులు కేటాయించకపోగా కేంద్రం ఇచ్చిన వాటినీ దారిమళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.4వేల కోట్లతో పంచాయతీలను బలోపేతం చేసే చర్యలు చేపట్టిందని తెలిపారు. గుర్ల ప్రాంతానికి ఇన్నాళ్లూ ప్రాతినిధ్యం వహిస్తున్నందున తన వల్ల కూడా ఇది జరిగిందని ఒప్పుకోవాలని బొత్స సత్య నారాయణకు అచ్చెన్న హితవు పలికారు.
Last Updated : Nov 14, 2024, 2:01 PM IST