ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: జ్యురిచ్‌లో స్విస్ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు టీమ్​ భేటీ - ప్రత్యక్ష ప్రసారం - CHANDRABABU MET WITH INDUSTRIALISTS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2025, 5:11 PM IST

Updated : Jan 20, 2025, 7:01 PM IST

LIVE : దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్​, టీజీ భరత్, అధికారుల బృందం జ్యూరిచ్‌ ఎయిర్​పోర్ట్​కు చేరుకున్నారు. అక్కడ వారికి యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలోనే విమానాశ్రయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ కాసేపు ముచ్చటించుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై వారి మధ్య చర్చ జరిగింది. అనంతరం చంద్రబాబు బృందం విమానాశ్రయం నుంచి హిల్టర్ హోటల్​కు చేరుకున్నారు.​ అక్కడ భారత రాయబారి మృదుల్‌కుమార్‌తో ఆయన భేటీ అయ్యారు. పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం సమావేశమైంది.  శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపిలో మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్ అండ్ డి కేంద్రాలు, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ప్రెసిషన్ ఇన్ స్ట్రుమెంట్స్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పారిశ్రామికవేత్తలకు లోకేశ్​ సూచించారు. పారిశ్రామికవేత్తలతో సమావేశం ప్రత్యక్ష ప్రసారం 
Last Updated : Jan 20, 2025, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details