LIVE: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం- ప్రత్యక్షప్రసారం - AP CEO Meena Media Conference - AP CEO MEENA MEDIA CONFERENCE
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 2, 2024, 4:08 PM IST
|Updated : May 2, 2024, 4:40 PM IST
AP CEO Mukesh Kumar Meena Media Conference Live: హోం ఓటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 180 కోట్ల మేర నగదు, ఇతర వస్తువులను సీజ్ చేశామని వివరించారు. 22 కోట్ల విలువైన మద్యం, 31 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్ చేశామన్నారు. 41 కోట్ల మేర విలువైన ఆభరణాలు, పరికరాలు, వస్తువుల పట్టుబడిన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 44 వేల 163 మంది వాలంటీర్ల రాజీనామా చేసినట్లు ఆయన వివరించారు. 1017 వాలంటీర్లను తప్పించామని మీనా తెలిపారు. ఇప్పటి వరకు వాలంటీర్లపై 86 కేసులు నమోదయ్యాయని తెలిపారు.ఎన్నికల్లో 5 లక్షల 26 వేల 10 మంది ఎన్నికల సిబ్బంది పాల్గోంటారని, పోలింగ్ డ్యూటీలో 3.30 లక్షల మంది నియమించినట్లు తెలిపారు. బ్రూవరీస్, డిస్టలరీస్ వద్ద వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లు చేసిన్నట్లు తెలిపారు. మద్యం స్టోరేజ్ గొడౌన్ల వద్ద వెబ్ క్యాస్టింగ్, 30 వేల పోలింగ్ స్టేషన్ల వద్ద వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అరకు, రంపచోడవరం, పాడేరు సెగ్మెంట్లల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, పాలకొండ, కురుపాం, సాలూరు సెగ్మెంట్లల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : May 2, 2024, 4:40 PM IST