ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: అసెంబ్లీ సమావేశాలు - ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం - AP ASSEMBLY BUDGET SESSIONS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2025, 9:59 AM IST

Updated : Feb 24, 2025, 11:13 AM IST

AP Assembly Budget Sessions: ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగిస్తున్నారు. గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి, అందిస్తున్న సంక్షేమం, 2047 లక్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు, తదితర అంశాలపై ప్రసంగం ఉండనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై 25న చర్చ జరగనుంది. చివరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానమిస్తారు. 26న శివరాత్రి, 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కావడంతో ఆ రెండు రోజులు సభ ఉండదు. 28న సీఎం అధ్యక్షతన ఆయన కార్యాలయంలో మంత్రి మండలి సమావేశం కానుంది. ఆందులో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌కు లాంఛనంగా ఆమోదముద్ర వేయనున్నారు. అదే రోజు బడ్జెట్‌ని ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లుగా బడ్జెట్‌ రూపకల్పన చేసినట్లు సమాచారం. మార్చి 3 నుంచి బడ్జెట్‌ సహా అనేక అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట్రంలో కూటమి సర్కార్‌ ఏర్పడ్డాక తొలిసారి ప్రవేశపెడుతోన్న పూర్తిస్థాయి బడ్జెట్‌ సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
Last Updated : Feb 24, 2025, 11:13 AM IST

ABOUT THE AUTHOR

...view details