ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఫోర్జరీ సంతకాలతో సొమ్ము స్వాహా - బ్యాంకు నోటీసులతో బయటపడ్డ యానిమేటర్లు నిజస్వరూపం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 5:58 PM IST

Animators Fraud in Satyasai District: తమకు తెలియకుండా తమ ఖాతాలలోని సొమ్మును బుక్​ కీపర్లు, యానిమేటర్లు స్వాహా చేశారంటూ పొదుపు సంఘాల మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన సత్యసాయి జిల్లాలో చోటు చోసుకుంది. గాండ్లపెంట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పొదుపు సంఘాల సభ్యుల సొమ్మును ఫోర్జరీ సంతకాలతో డ్రా చేసి తన సొంతానికి వాడుకున్నారు. మహిళలకు బ్యాంకు నుంచి నోటీసులు రావడం వల్ల అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Women Complained to Police : రూ. 12 లక్షల బకాయి ఉన్నట్టు మొత్తం 14 సంఘాలకు బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో అప్రమత్తం అయిన మహిళలు తమ ఖాతాలను చేసుకుంటే అసలు విషయం బయటపడింది. బ్యాంకు అధికారులు మంజూరు చేసిన రుణాలను యానిమేటర్లు ఫోర్జరీ సంతకం ద్వారా విత్​డ్రా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ నగదును స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్​ అధికారులకు మహిళలు విజ్ఞప్తి చేశారు. 

ABOUT THE AUTHOR

...view details