ఐప్యాక్ సిబ్బందితో జగన్‌కు అదే చివరి సెల్ఫీ: ఆనం - Anam Allegations on CM Jagan - ANAM ALLEGATIONS ON CM JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 17, 2024, 3:21 PM IST
Anam Ramanarayana Reddy Allegations on CM Jagan: జగన్ పాలనలో అన్నీ అరాచకాలేనని ఆఖరికి పోలింగ్ రోజు, మరుసటి రోజు కూడా వైసీపీ మూకలు బరితెగించి హింసకు పాల్పడ్డారని ఆత్మకూరు తెలుగుదేశం అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ఏజెంట్లపై దాడులు వైసీపీ దాష్టీకానికి నిదర్శనమన్నారు. వైసీపీ ఓటమి ఖాయమని ఐప్యాక్ సిబ్బందితో జగన్ తీసుకున్న సెల్ఫీ చివరిదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల పేరు చెప్పి ఒక్క నెలలో 14 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి తమ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని విమర్శించారు. రైతులను దోచుకునేందుకే జగన్ ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తెచ్చారని విమర్శించారు. ఎన్నికల్లో అధికార పార్టీకి కొందరు అధికారులు కొమ్ము కాసారని మండిపడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత లేదని అన్నారు. వైసీపీకి ఓటు వేయలేదని ఇంట్లో ఉన్న మహిళలు, పిల్లలపై దాడి చేయడం వైసీపీ అరాచకత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.