ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అమరావతిని విధ్వంసం చేసిన జగన్‌ను ఓడించాలి : రాజధాని రైతులు - Amaravathi farmers

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 4, 2024, 12:37 PM IST

Amaravati Farmers movement reaches 1600 days : రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం 1600 రోజులకు చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాల వద్ద రాజధాని రైతులు ఆందోళన చేశారు. జగన్ నిర్వాకం వల్ల రూ.10 వేల కోట్లతో నిర్మించిన భవనాలు పాడవుతున్నాయని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధాని లేని రాష్ట్రం కోసం రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చామని అమరావతి రైతులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో శరవేగంగా భవన నిర్మాణ పనులు జరుగుతుండేవని పేర్కొన్నారు. జగన్​ సర్కార్​ అధికారంలోకి వచ్చాక ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతికి పునర్ వైభవం రావాలంటే మే 13న జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమరావతిని విధ్వంసం చేసిన జగన్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details