జీ 20 సదస్సు పేరుతో వైఎస్సార్సీపీ నేతలు కోట్లు దోచేశారు - Alliance Leaders on GVMC Corruption - ALLIANCE LEADERS ON GVMC CORRUPTION
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2024, 4:46 PM IST
Alliance Leaders Accused of Massive Corruption in GVMC: వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని కూటమిపక్ష నేతలు ఆరోపించారు. విశాఖ మాజీ ఎంవీవీ సత్యనారాయణ, ఇతర వైఎస్సార్సీపీ నేతలు టీడీఆర్ బాండ్ల పేరిట కోట్లు కాజేశారని చెప్పారు. అంతే కాకుండా వేల ఎకరాల భూములు కబ్జా చేశారని అన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్‌లు సహా వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్లు అవినీతిలో భాగస్వాములని ఆరోపించారు. జీ 20 సదస్సు పేరు చెప్పి మొక్కలు పేరుతో కోట్లు కుంభకోణం జరిగిందని కూటమి కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. గత వైఎస్సార్సీపీ హయాంలో కనీసం వీధి దీపాలు పెట్టలేదని ఆరోపించారు. పనిముట్లు కూడా ఇవ్వకుండా వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టిందని కూటమి నేతలు ఆరోపించారు. అంతే కాకుండా మేయర్‌తో సహా డిప్యూటీ మేయర్‌లు, వైసీపీ ఫ్లోర్ లీడర్లు నిట్టనిలువునా అవినీతి చేసారని కూటమి పక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.