ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సాహసం చేశారు - ఇంటికి చేరారు - 200 Labourers Crossed the Stream - 200 LABOURERS CROSSED THE STREAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 8:14 AM IST

Agricultural Labourers Daring : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున వాగులు, చెరువులు, నదులు, కాలువలు, జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి. అందువల్ల వాటివైపు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే పలు సూచనలు చేస్తున్నారు. ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో నియమాలు పాటించిన ప్రమాదాలు జరుగుతాయి. కానీ ఈ వ్యవసాయ కూలీలు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఐకమత్యమే మహాబలమని నిరూపించారు.  

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్​లో భారీ వర్షం కురిసింది. వీఆర్​పురం మండలం రేఖపల్లి అన్నవరం మధ్య వాగు రహదారిపై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ముమ్మిడివరం వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలు 200 మంది అవతల ఉండిపోయారు. వేగంగా వస్తున్న వరద నీరును చూసి ఏమి జరుగుతుందో అని వ్యవసాయ కూలీల్లో భయాందోళన నెలకొంది. ఈ సమయంలో వారు కంగారు పడకుండా "భయాందోళన వద్దు - సమయస్ఫూర్తి ముద్దు" అనే నినాదంతో చేయీ చేయీ కలిపి ముందుకు కదిలారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న అన్నవరం వాగును అతి కష్టం మీద ఒకరినొకరు పట్టుకుని సాహసం చేసి అవతలి వైపునకు వెళ్లారు. అందరూ క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details