ప్రజాసేవ లక్ష్యంతో పవన్ రాజకీయాల్లోకి వచ్చారు- భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపిద్దాం: సప్తగిరి - Actor Saptagiri Election Campaign - ACTOR SAPTAGIRI ELECTION CAMPAIGN
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 3, 2024, 1:30 PM IST
Actor Saptagiri Election Campaign: కోట్ల సంపద వదులుకుని ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని సినీ నటుడు సప్తగిరి అన్నారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం కన్నూరుపాలెంలో కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ నిర్వహించిన సభలో సప్తగిరి పాల్గొన్నారు. కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో పవన్‌కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని సప్తగిరి తెలిపారు. ప్రజాక్షేమం కోసం పవన్ కల్యాణ్ ఎంత దూరమైన వెళ్తారని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలంటే కూటమి అభ్యర్థులకు ఓట్ల వేసి మెజారిటీతో గెలిపించాలన్నారు.
పవన్ కల్యాణ్ కొత్తగా ఆలోచిస్తారని, ఆయనని అసెంబ్లీకి పంపించాలని కోరారు. ప్రజలంటే పవన్ కల్యాణ్‌కు ఎంతో ప్రేమ అని తెలిపారు. ఒక్కో సినిమాకి వందల కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకున్నా కూడా ప్రజలకు సేవ చేయాలనే పట్టుదలతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారని అన్నారు. పేద ప్రజలకు సేవ చేయాలనే పవన్ కల్యాణ్ కోరిక తీరాలంటే భారీ మెజారిటీతో గెలిపించాలని సప్తగిరి పిలుపునిచ్చారు.