ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

యూనివర్శిటీలో నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ విగ్రహం- తొలగించాలని బోధనేతర సిబ్బంది ఆందోళన - ANU Non Teaching Staff Agitation - ANU NON TEACHING STAFF AGITATION

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 10, 2024, 3:36 PM IST

Updated : Jun 10, 2024, 5:19 PM IST

Acharya Nagarjuna University Non Teaching Staff Agitation: వైఎస్సార్సీపీ పాలనలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధంగా రాజకీయాలకు వేదికగా మార్చారని యూనివర్శిటీ బోధనేతర సిబ్బంది మండిపడ్డారు. విద్యాబుద్ధులు నేర్పించే విశ్వవిద్యాలయంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహన్ని తొలగించాలని ఆందోళనకు దిగారు. పాలకుల మెప్పు పొందడం కోసం యూనివర్శిటీలో రాజకీయ సమావేశాలు, చర్చలు నిర్వహించిన వీసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వీసీ స్పందించి రాజకీయ నాయకుల విగ్రహాలను తొలగించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

"జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధంగా రాజకీయాలకు వేదికగా మార్చారు. విద్యాబుద్ధులు నేర్పించే విశ్వవిద్యాలయంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహన్ని వెంటనే తొలగించాలి. దీంతోపాటు పాలకుల మెప్పు పొందడం కోసం యూనివర్శిటీలో రాజకీయ సమావేశాలు, చర్చలు నిర్వహించిన వీసీపై వెంటనే చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో మా పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం." - యూనివర్శిటీ బోధనేతర సిబ్బంది 

Last Updated : Jun 10, 2024, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details