తెలంగాణ

telangana

ETV Bharat / videos

దసరా రోజున మద్యం షాపులో చోరీ - కౌంటర్​లో ఉంచిన రూ.12 లక్షలతో పరారీ - THIEF STOLE RS 12 LAKHS WINE SHOP

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2024, 1:33 PM IST

Theft of RS 12 Lakhs at Liquor Shop in Nalgonda : నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని ఆదిత్య వైన్స్​లో అర్ధరాత్రి చోరీ జరిగింది. వైన్​ షాపు పైకప్పు రేకులను పగులగొట్టి దొంగ లోపలికి ప్రవేశించి రూ.12 లక్షలను అపహరించుకుపోయాడు. ఇది అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ చోరీపై షాపు నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన పరిసరాలను పరిశీలించారు. 

అనంతరం దుకాణం యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దసరా పండుగ కావడంతో షాపులో ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉంటాయని ముందుగానే ఊహించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరా దృష్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్​ టీంకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దసరా సందర్భంగా బ్యాంకుకు సెలవు ఉండటంతో నగదును షాపులోనే ఉంచినట్లు యజమాని పోలీసులకు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details