'ఆపరేషన్ చేయూత' ఎఫెక్ట్ - లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు - six Maoist Members Surrender - SIX MAOIST MEMBERS SURRENDER
Published : Apr 21, 2024, 4:03 PM IST
six Maoist Members Surrender : భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్ ఎదుట ఆరుగురు మావోయిస్టు మిలిషియా సభ్యులు లొంగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ చేపట్టిన 'ఆపరేషన్ చేయూత' కార్యక్రమంలో భాగంగా వీరంతా లొంగిపోయినట్లు ఏఎస్పీ తెలిపారు. వీరంతా ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టు మిలిషియాలో వివిధ కేటగిరీల్లో సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సరిహద్దు ప్రాంతంలోని కృష్ణారం పోలీస్స్టేషన్ పరిధిలోని డోకుపాడు గ్రామానికి చెందిన వీరంతా మావోయిస్టులకు పోలీసులకు జరిగిన పలు విధ్వంసకర చర్యల్లో పాల్గొన్నారని ఏఎస్పీ తెలిపారు. తెలంగాణ - ఛత్తీస్గఢ్ అడవుల్లో ఈ ఆరుగురు సభ్యులు మావోయిస్టు మిలిషియాలో వివిధ విభాగాల్లో పని చేసినట్లుగా ఆయన వెల్లడించారు. ప్రస్తుత కాలంలో అడవుల్లో మావోయిస్టుల ఉనికి తగ్గిపోవడంతో ప్రభుత్వం అందించే ప్రతిఫలాలను దృష్టిలో ఉంచుకుని వీరంతా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు వివరించారు. ఇప్పటికీ అడవుల్లో జీవనం గడుపుతున్న మావోయిస్టులు స్వయంగానైనా, కుటుంబసభ్యుల ద్వారానైనా లొంగిపోతే వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందిస్తామని ఏఎస్పీ తెలిపారు.