ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'బాలయ్య మామయ్యా సరిలేరు నీకెవ్వరయ్యా'- బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రయాణోత్సవం - NBK 50 Years Celebrations in ap - NBK 50 YEARS CELEBRATIONS IN AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2024, 11:25 AM IST

50 Years of Nandamuri Balakrishna Film Journey Celebrations in Andhra Pradesh : నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ శ్రేణులు, అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఏభై ఏళ్లుగా వెండితెరపై తిరుగులేని కథానాయకుడిగా వెలుగుతున్న బాలయ్య మామయ్యా సరిలేరు నీకెవ్వరయ్యా అంటూ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రయోజనాత్మక, ప్రయోగాత్మక సినిమాలతో గాడ్ ఆఫ్ మాసెస్ గా బాలయ్య మామయ్య పేరుగాంచారన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల వద్ద ఎమ్మెల్యే గోండు శంకర్, బాలకృష్ణ అభిమానులుతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నెల్లూరులో బాలకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు , టీడీపీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించి 50కేజీల కేక్ కట్ చేసి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు టీడీపీ కార్యాలయంలో బాలకృష్ణ సీనియర్ అభిమానులను సన్మానించి కేక్ కట్ కట్ చేశారు. సినిమాల్లో రాణిస్తునే, క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణ, రాజకీయల్లో మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి పదవులు ఆశించకుండా ప్రజా సేవ చేయడం బాలయ్యబాబుకే సొంతం అని ఆయన అభిమానులు కొనియాడారు. 

ABOUT THE AUTHOR

...view details