ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఉమ్మడి గుంటూరులో భారీగా పెరిగిన డయేరియా కేసులు! - 40 Affected by Diarrhea in Guntur - 40 AFFECTED BY DIARRHEA IN GUNTUR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 26, 2024, 4:10 PM IST

40 Affected by Diarrhea in Guntur District : విరేచనాలు, వాంతులతో బాధపడుతూ 40 మందికిపైగా బాధితులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రావడం కలకలం రేపింది. గత మూడు రోజులుగా నగరానికి చెందిన వారే కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ పట్టణాల నుంచి నీళ్ల విరేచనాలతో ఇబ్బంది పడుతూ వచ్చిన రోగులు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. తాజాగా మరో 10 మంది మంది అవే లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రికి రావటం ఆందోళనకు కల్గిస్తోంది.

బాధితులందరిని అత్యవసర విభాగం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కిరణ్‌ కుమార్‌ తెలిపారు. ఆరోగ్యం పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డయేరియా బాధితులకు ఐసీయూలో అత్యుత్తమ వైద్యం అందిస్తున్నట్లు, ఆరోగ్యం మెరుగుకావడంతో 20 మంది వరకూ డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు.

 గుంటూరులోని ఏటీ అగ్రహారం, అశోక్‌నగర్, బ్రాడీపేట, సంజీవయ్యనగర్, నల్లచెర్వు, మంగళదాస్‌నగర్, అమరావతిరోడ్డు, కోబాల్టుపేట, అంబేడ్కర్‌నగర్‌ ప్రాంతాలకు చెందిన వారు కలుషిత నీరు, ఆహారం వల్ల వాంతులు, విరేచనాలు కావడంతో ఆసుపత్రిలో చేరారు. 

ABOUT THE AUTHOR

...view details