ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్నికల వేళ పోలీసుల ప్రత్యేక నిఘా - ఒక్క జిల్లాలోనే రూ. 4.5 కోట్లు సీజ్ - Money Seize at Checkposts - MONEY SEIZE AT CHECKPOSTS

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 5:52 PM IST

4 Crores 50 Lakh Rupees Seized by Police at Checkposts : ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగదు రవాణా ఎక్కువైందని, గతంతో పోలిస్తే ఈసారి నగదు సీజింగ్ (seize) అధికంగా ఉందని అనంతపురం ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఎక్కడికక్కడ అక్రమ నగదును (illegal cash) సీజ్‌ చేస్తున్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే నాలుగున్నర కోట్ల రూపాయలు పట్టుకున్నామని ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. 

ఎన్నికల సందర్భంగా రాష్ట్ర సరిహద్దులో నిఘా పెంచినట్లు అన్బురాజన్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అంతర్రాష్ట్ర సరిహద్దులో 23 చెక్ పోస్టులు, 5 మెుబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రతి రోజూ అక్రమ మద్యం రవాణా కేసులు 20-30 వరకు నమోదు అవుతున్నాయని, 77 లైసెన్స్ తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఎక్కడైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరుగుతుంటే ప్రజలు సీ విజిల్ యాప్, డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు తెలపాలని, సమాచారం అందించిన వారి విషయాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details