ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

టీడీపీతోనే ప్రజలకు న్యాయం జరుగుతుంది: పుత్తా నరసింహారెడ్డి - 125 Families Joined in TDP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 12:37 PM IST

125 Families Joined in TDP At YSR District: వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వలసల (Joinings) పర్వం జోరుగా కొనసాగుతోంది.  వైయస్సార్‌ జిల్లా చెన్నూరు, పెండ్లిమర్రి నుంచి మొత్తం 125 కుటుంబాలు తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి (TDP State Vice President Putta Narasimha Reddy) ఆధ్వర్యంలో పార్టీలో చేరాయి. టీడీపీలో చేరిన వారికి నరసింహా రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.  

తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని పుత్తా నరసింహారెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి చంద్రబాబుతోనే సాధ్యమని నరసింహారెడ్డి స్పష్టం చేశారు. చెన్నూరు ప్రధాన రహదారి వద్ద నుంచి పాత బస్టాండ్ వరకు యువకులు భారీ బైక్ ర్యాలీతో నరసింహారెడ్డికి ఘన స్వాగతం పలికారు. కొప్పర్తి వద్ద ఇండస్ట్రియల్ ఏరియాను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే అభివృద్ధి చేసి నియోజకవర్గంలో ఎక్కువ మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా కృషి చేస్తానని నరసింహారెడ్డి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details