తెలంగాణ

telangana

ETV Bharat / videos

అయ్యో రామా ఎంత కష్టమొచ్చే - నీళ్లు లేక 10 టన్నుల చేపలు మృతి - లబోదిబోమంటున్న మత్స్యకారులు - 10 TONNES FISHES DIED IN WANAPARTHY - 10 TONNES FISHES DIED IN WANAPARTHY

By ETV Bharat Telangana Team

Published : Apr 26, 2024, 2:14 PM IST

Fishes Died in Wanaparthy District  : ఎండలకు చెరువులోని నీరు అడుగంటిపోవడంతో భారీగా చేపలు మృత్యువాత పడుతున్నాయి. వనపర్తి జిల్లా  బెక్కెం చెరువులో నీరు అడుగంటడంతో  భారీగా చేపలు మృతి చెందాయి.  కేజీ నుంచి రెండు కేజీల బరువున్న చేపలు చనిపోవడంతో వాటితో జీవనోపాధి పొందే మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. చెరువులో నీరులేక దాదాపు 10 టన్నుల చేపలు చనిపోవడం జరిగిందని మత్స్యకారులు వాపోయారు. 

అతి తక్కువ నీటిపై చెరువులో చేపలు చనిపోయి ఉండటం అందరినీ కలచివేసింది. టన్నుకు లక్ష రూపాయల ధర పలుకుతున్నాయని, పది టన్నుల చేపలు చనిపోవడంతో రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్యం స్పందించి మత్స్యకారులు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. ఫలితంగా జలాశయాల్లో ఉన్న నీరు అడుగంటాయి.  మనుషులకే కాకుండా నీటిలోని జీవజాలాలకు ఇబ్బందులు తప్పడం లేదు. కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఘటనే జయశంకర్ భూపాల పల్లిలో జరిగింది. ఎండ వేడిమికి వేలాదిగా చేపలు మృతృవాతపడ్డాయి.

ABOUT THE AUTHOR

...view details