Mid Range Smartphones with AI Features:ఇండియన్ మార్కెట్లోగత కొన్నేళ్లగా మిడ్‌రేంజ్ స్మార్ట్ఫోన్ల హవా కొనసాగుతోంది. ఐఫోన్, శాంసంగ్, గూగుల్ వంటి టాప్ బ్రాండ్ల నుంచి ఎన్నో ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ కస్టమర్లు ఫ్లాగ్షిప్ ఫోన్లను వదిలేసి మిడ్‌రేంజ్ ఫోన్లపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
తక్కువ ధరతో మెరుగైన ఫీచర్లతో ఇవి ఫ్లాగ్షిప్ ఫోన్లకు గట్టి పోటీని ఇస్తున్నాయి. అంతేకాక ఈ మొబైల్స్‌లో ఎన్నో రకాల ఏఐ ఫీచర్లను కూడా జోడించడంతో మార్కెట్లో వీటి సేల్స్ ఊపందుకున్నాయి. ఇక వివో, ఒప్పో, వన్‌ప్లస్ వంటి బ్రాండ్ల నుంచి ఫ్లాగ్షిప్తో పాటు మిడ్‌రేంజ్ స్మార్ట్ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు కూడా మంచి మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఈ ఏడాది AI ఫీచర్లతో లాంఛ్ అయిన టాప్ మోడల్స్ వివరాలు మీకోసం.
ఈ ఏడాది AI ఫీచర్లతో రిలీజ్ అయిన టాప్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!:
'VIVO X200' Series: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన 'వివో X200' సిరీస్ మొబైల్స్‌ను ఎట్టకేలకూ ఇటీవలే ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేసింది. కంపెనీ ఈ సిరీస్‌లో 'వివో X200', 'వివో X200 ప్రో' అనే రెండు మోడల్ మొబైల్స్‌ను తీసుకొచ్చింది. ఈ మొబైల్స్‌లో 6000mAh వరకు పవర్ఫుల్ బ్యాటరీతో పాటు 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కూడా పొందొచ్చు. ఈ సిరీస్ రూ.65,999 ప్రారంభ ధరతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
'వివో X200' సిరీస్ ఫీచర్లు:
- 6.67 అంగుళాల క్వాడ్-కర్వ్డ్ OLED LTPS డిస్ప్లే
- 120Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్
- 1.63mm అల్ట్రా-స్లిమ్ బెజెల్స్
- 200MP Zeiss APO టెలిఫోటో కెమెరా
- 4K HDR సినిమా పోర్ట్రెయిట్ వీడియో రికార్డ్
- పవర్ఫుల్ 6000mAh బ్యాటరీ
- 90W స్పీడ్ ఛార్జింగ్
- మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్
- 3nm ప్రాసెసర్ టెక్నాలజీ
Vivo V40 Pro:వివో V40 ప్రో (Review)లో AI ఎరేజర్, AI ఫోటో ఎన్‌హాన్సర్ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ తన లేటెస్ట్ మోడల్ మొబైల్స్‌లో 'జెమిని AI'ని కూడా అందించింది. అంతేకాక కొన్ని లిమిటెట్ కెమెరా AI ఫీచర్లను కూడా వీటిలో తీసుకొచ్చింది.
ఇతర ఫీచర్లు:
- డిస్ప్లే: 6.78-అంగుళాల AMOLED
- ఫ్రంట్ కెమెరా:50MP
- చిప్‌సెట్:మీడియాటెక్ డైమెన్సిటీ 9200+
- బ్యాటరీ: 5500mAh
- RAM+స్టోరేజ్:12GB/512GB
- ఛార్జింగ్:80W
- వెనక కెమెరా:200MP+50MP+50MP
- OS: ఆండ్రాయిడ్ 14
- ధర:రూ.49,999 నుంచి ప్రారంభం.
OnePlus Nord 4:'వన్‌ప్లస్ నార్డ్ 4' అనేది AI స్మార్ట్‌ఫోన్. ఇది ఫొటో ఎడిటింగ్‌కు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాక ఈ ఫోన్లో AI ఎరేజర్ 2.0, AI స్మార్ట్ కటౌట్ 2.0, AI క్లియర్ ఫేస్, AI స్పీక్, AI సమ్మరీ, AI రైటర్, రికార్డింగ్ సమ్మరీ, AI లింక్ బూస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ మొబైల్లో హైలెట్ ఫీచర్ ఏంటంటే 'AI స్పీక్'. ఇది మనం ఏదైనా వెబ్ పేజ్‌లోని టెక్స్ట్‌ను చదవాల్సి వచ్చినప్పుడు మీకు కావాలంటే దాన్ని చదివి వినిపిస్తుంది. అంతేకాక ఈ ఫీచర్ మనకు టెక్ట్స్‌ను చదివి వినిపిస్తున్న సమయంలో దాని వాయిస్ జెండర్, రీడింగ్ స్పీడ్ రెండింటినీ మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది.