తెలంగాణ

telangana

ETV Bharat / technology

వాట్సాప్​లో మరో అద్భుతమైన ఫీచర్- ఇకపై కాంటాక్ట్ మేనేజ్​మెంట్​ ఈజీ బాస్..!

సరికొత్త ఫీచర్​పై వాట్సాప్​ కసరత్తు- దీని ఉపయోగాలివే..!

WhatsApp New Feature for Easy Contact Management
WhatsApp New Feature for Easy Contact Management (WhatsApp)

By ETV Bharat Tech Team

Published : 6 hours ago

WhatsApp New Feature for Easy Contact Management: ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సప్‌ మరో కొత్త ఫీచర్​ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్​ సహాయంతో కొత్త కాంటాక్ట్‌ను ప్రత్యేకంగా వాట్సప్‌లోనే సేవ్​ చేసుకోవచ్చు. అంటే కాంటాక్ట్‌ సేవ్‌ చేసే సమయంలో కేవలం వాట్సప్‌లో యాడ్‌ చేయాలా? లేదా మొబైల్‌లోనూ యాడ్‌ చేయాలా? అనే రెండు ఆప్షన్లు కన్పించనున్నాయి. అందులో మనకు నచ్చిన ఆప్షన్​ను ఎంచుకుని కాంటాక్ట్​ను సేవ్​ చేసుకోవచ్చు.

ఒకవేళ ఫోన్‌ పోగొట్టుకున్నా, మొబైల్‌ని మార్చినా వాట్సప్‌లోని కాంటాక్ట్స్​ మాత్రం అలాగే ఉంటాయి. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయని, త్వరలోనే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాబీటా ఇన్ఫో తన బ్లాగ్​లో పంచుకుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన స్క్రీన్​షాట్​ను పంచుకుంది. త్వరలోనే ఈ సరికొత్త ఫీచర్‌ వాట్సప్‌ వెబ్‌, విండోస్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

ఇంతకుముందు వాట్సప్‌లోని చాట్​లు పేరుతో కనిపించాలంటే ప్రైమరీ డివైజ్‌లోనే కాంటాక్ట్‌ని సేవ్‌ చేయాల్సి ఉండేది. లింక్డ్‌ డివైజెస్‌లో సేవ్‌ చేసే అవకాశం ఉండేది కాదు. దీంతో ఒకటి కంటే ఎక్కువ డివైజుల్లో వాట్సాప్​ని ఉపయోగించే వాళ్లు పేర్లు యాడ్ చేసేందుకు ప్రతిసారీ ప్రైమరీ డివైజ్‌కు వెళ్లాల్సి వచ్చేది. దీంతో వాట్సాప్​ ఈ సమస్యకు చెక్ పెడుతూ లింక్‌ చేసిన పరికరాల్లోనూ కాంటాక్ట్‌ని సేవ్‌ చేసేలా సదుపాయాన్ని యూజర్లకు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కొత్త కాంటాక్ట్‌ని ప్రత్యేకంగా వాట్సప్‌లోనే సేవ్‌ చేసేలా కొత్త ఫీచర్‌ తీసుకొచ్చేందుకు కసరత్తులు మొదలుపెట్టింది.

దీంతోపాటు మరో ఇంట్రస్టింగ్ వాట్సాప్ చాట్ మెమరీ ఫీచర్ తీసుకొచ్చేందుకు ఈ మెసేజింగ్‌ యాప్‌ కసరత్తు చేస్తోంది. ఇది మెటా ఏఐతో షేర్​ చేసిన పర్సనల్ డేటాను రికార్డ్ చేసేందుకు ఉపయోగపడనుంది. ఆ తర్వాత మనకు అవసరమైనప్పుడు కావాల్సిన సమాచారం, సూచనలను ఇవ్వనుంది. అంటే ఇది మనకు పర్సనల్​ అసిస్టెంట్​గా ఉపయోగపడుతుందన్న మాట. ఈ వాట్సాప్ చాట్ మెమరీ ఫీచర్​పై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఫేస్​బుక్​, ఇన్​స్టాలో ఫేషియల్ రికగ్నైజేషన్​ ఫీచర్​- ఇకపై ఆన్​లైన్​ మోసాలకు చెక్​..!

BSNL యూజర్స్​కు ఫ్రీ Wi-Fi కనెక్షన్​- వావ్.. ఆఫర్ అదిరిందిగా..!

ABOUT THE AUTHOR

...view details