WhatsApp AI Image Generation Tool :వాట్సాప్‌లో సరికొత్త ఇమేజ్ జనరేషన్ టూల్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఇమేజ్ జనరేటర్ ద్వారా మీ ఫొటోను మీకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.
కొత్త ఫీచర్స్‌ను వాడుకోవడం ఎలా?
ఉదాహరణకు మీరు Imagine Yourself పై క్లిక్ చేసి, 'ఇమాజెన్ మీ యాజ్ ఏ ఆస్ట్రోనాట్' అని టైప్ చేసి, ఎంటర్ చేస్తే చాలు. వెంటనే మెటా ఏఐ, మిమ్మల్ని అంతరిక్ష యాత్రికుడిగా మార్చి ఓ ఫొటోను జనరేట్ చేసి ఇస్తుంది. ఒకవేళ మీరు దీనిని ఎడిట్ చేయాలని అనుకుంటే, Edit your AI imagesపై క్లిక్ చేసి, మీకు కావాల్సిన మార్పుల గురించి రాయాలి. వెంటనే మెటా ఏఐ మీకు కావాల్సిన విధంగా ఇమేజ్ను మార్చి ఇస్తుంది. ప్రస్తుతానికి ఇది కొంత మంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వాట్సాప్‌లో 'ఎయిర్ డ్రాప్' తరహా ఫీచర్
వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను యూజర్లకు అందిస్తూ సరికొత్తగా రూపును సంతరించుకుంటోంది. త్వరలో మరో అడ్వాన్స్‌డ్ ఫీచర్‌ను విడుదల చేసేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. ఆ ఫీచర్ అచ్చం యాపిల్ ఐఫోన్లలోని 'ఎయిర్ డ్రాప్' ఫీచర్‌ను తలపించేలా ఉంటుందని అంటున్నారు. ఒక ఐఫోన్ నుంచి మరో ఐఫోన్‌కు ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే ఫైల్స్‌ను బదిలీ చేసే వసతి ఉండటం అనేది ఈ ఫీచర్‌లోని ప్రత్యేకత. గతంలోనే ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లలో టెస్ట్ చేశారు. ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫైల్స్‌ను షేర్ చేసే ఈ ఫీచర్‌ను ఇప్పుడు 'టెస్ట్‌ఫ్లయిట్ బీటా' ప్రోగ్రాం ద్వారా వాట్సాప్ బీటాలో పరీక్షిస్తున్నారు. ప్రత్యేకంగా ఐఓఎస్ వెర్షన్ 24.15.10.70లో ఈ ఫీచర్‌ను టెస్టు చేస్తున్నారని తెలుస్తోంది.