తెలంగాణ

telangana

ETV Bharat / technology

వాట్సాప్ స్పెషల్​ హెల్ప్​లైన్​తో 'డీప్​ఫేక్స్​'కు చెక్​!

WhatsApp Deepfake Helpline : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్​. డీప్​ఫేక్​ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీల సాయంతో రూపొందిస్తున్న తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు వాట్సాప్​ ప్రత్యేక హెల్ప్​లైన్​ను ఏర్పాటుచేస్తోంది. ఈ 2024 మార్చి నెల నుంచే ఇది అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాలు మీ కోసం.

Meta deepfake helpline
WhatsApp deepfake helpline

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 12:08 PM IST

WhatsApp Deepfake Helpline : నేడు డీప్‌ఫేక్‌ ఫొటోల, వీడియోల బెడద, తప్పుడు సమాచారాల విస్తృతి విపరీతంగా పెరుగుతోంది. దీనిని అరికట్టేందుకు ప్రముఖ టెక్నాలజీ సంస్థ మెటా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ, డీప్​ఫేక్ టెక్నాలజీలతో రూపొందిస్తున్న తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు, వాట్సప్‌లో ప్రత్యేకంగా ఒక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

తప్పుడు సమాచారానికి చెక్​
ఈ ఫ్యాక్ట్ చెక్ హెల్ప్​లైన్​ ద్వారా డీప్​ఫేక్​ చిత్రాలను, వీడియోలను సులభంగా గుర్తించడానికి వీలవుతుందని మెటా సంస్థ పేర్కొంది. ఇందుకోసం 'మిస్‌ఇన్ఫర్మేషన్‌ కంబాట్‌ అలయన్స్‌' (MCA)తో టై-అప్​ అయినట్లు వెల్లడించింది. 2024 మార్చి నుంచి ఈ హెల్ప్​లైన్​ వాట్సాప్​ యూజర్లు అందరికీ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది.

డీప్​ఫేక్స్​ డిటక్షన్​
వాట్సాప్​లోని ఈ హెల్ప్‌లైన్‌ సాయంతో యూజర్లు డీప్​ఫేక్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఎలా అంటే, వాట్సాప్​ హెల్ప్​లైన్ ద్వారా ఫిర్యాదు అందగానే ఎంసీఏ, దాని అనుబంధ స్వతంత్ర ఫ్యాక్ట్-చెకర్స్​, పరిశోధన సంస్థలు వైరల్ అవుతున్న తప్పుడు సమాచారాన్ని, ముఖ్యంగా డీప్‌ఫేక్‌ చిత్రాలను, వీడియోలను గుర్తిస్తాయని మెటా వెల్లడించింది.

వాట్సాప్​ హెల్ప్​లైన్ ద్వారా వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఎంసీఏ ప్రత్యేకంగా ఒక 'డీప్‌ఫేక్‌ అనాలసిస్‌ యూనిట్‌' నెలకొల్పుతుందని మెటా పేర్కొంది. ప్రస్తుతానికి ఇంగ్లీష్​, తెలుగు, హిందీ, తమిళ భాషలకు స్పందించే వాట్సాప్​ చాట్​బాట్లను సంప్రదించి, యూజర్లు డీప్​ఫేక్​ సమాచారాన్ని తెలుసుకోవచ్చని మెటా తెలిపింది.

ప్రధాన లక్ష్యం ఇదే!
సామాజిక మాధ్యమాల్లో, ప్రధానంగా వాట్సాప్​లో వస్తున్న తప్పుడు సమాచారాన్ని గుర్తించి, నిలువరించడం, తరువాత దానిని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ హెల్ప్​లైన్​ను తీసుకువస్తున్నట్లు మెటా స్పష్టం చేసింది. అంతేకాదు డీప్​ఫేక్​ కంటెంట్​పై ప్రజలకు అవగాహన కల్పించడం, సరైన సమాచారాన్ని అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ఈ వాట్సాప్​ హెల్ప్​లైన్​ను ఏర్పాటుచేసున్నట్లు పేర్కొంది. కనుక వాట్సాప్ యూజర్లు అందరూ ఈ సదుపాయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని కోరింది. అంతేకాదు వాట్సప్‌లో వచ్చే మెసేజ్‌లు నిజమైనవా? కాదా? అనేది ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలని సూచించింది.

వాట్సాప్​లో 'నియర్​బై షేర్​'
వాట్సాప్​త్వరలో 'నియర్​బై షేర్'​ ఫీచర్​ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఇది బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇదే కనుక అందరికీ అందుబాటులోకి వస్తే, వాట్సాప్​ యూజర్లు తమ సమీపంలోని వ్యక్తులకు చాలా సేఫ్​గా ఫైల్స్, ఫొటోస్​, వీడియోస్​ పంపించడానికి వీలవుతుంది.

గతంలో చాలా మంది యూజర్లు ఫొటో, ఆడియో, వీడియో, డాక్యుమెంట్ షేరింగ్‌ కోసం 'షేర్‌ ఇట్‌' అనే యాప్‌ను ఉపయోగించేవారు. దానిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీనితో గూగుల్‌ తమ యూజర్ల కోసం ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో 'నియర్‌బై షేర్‌' ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనితో ఒకేసారి చాలా మందికి ఫైల్స్‌ పంపవచ్చు. ముఖ్యంగా ఎలాంటి కేబుల్స్‌, నెట్‌వర్క్‌ అవసరం లేకుండా డివైజ్‌ టు డివైజ్‌ కనెక్టివిటీతో ఫైల్స్‌ షేర్‌ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీని తమ యూజర్లకు కూడా అందించాలని వాట్సాప్​ సిద్ధమవుతోంది.

ఇండియాలోని టాప్-7 యూట్యూబర్స్ - ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

ట్రూకాలర్​ నుంచి మీ ఫోన్​ నంబర్​ తొలగించాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

ABOUT THE AUTHOR

...view details