Vivo V50 5G Launch:దేశీయ మార్కెట్లోకి వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. 'వివో V50' పేరుతో కంపెనీ త్వరలో దీన్ని తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వివో ఈ ఫోన్ బ్యాటరీ, కెమెరా, IP రేటింగ్, డిజైన్, కలర్ ఆప్షన్లతో పాటు కొన్ని ఫీచర్ల వివరాలను వెల్లడించింది. అయితే కంపెనీ ఈ ఫోన్ లాంఛ్ డేట్‌ను మాత్రం ఇంకా ప్రకటించలేదు.
వివో ఈ అప్‌కమింగ్ ఫోన్‌పై ఇప్పటికే చాలా లీక్స్ వచ్చాయి. అందులోని కొన్ని నివేదికలు ఇది ఫిబ్రవరి మూడో వారంలో లాంఛ్ అవ్వొచ్చని వెల్లడించాయి. ఈ క్రమంలో తాజాగా దీనిపై మరో నివేదిక వచ్చింది. దీని ప్రకారం ఈ ఫోన్ ఫిబ్రవరి 17న భారతదేశంలో రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.
91Mobiles నివేదిక ప్రకారం.. వివో ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 17న భారతదేశంలో విడుదల చేయనుంది. దీంతోపాటు ఈ వివో అప్‌కమింగ్ ఫోన్ సేల్స్ ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా దీన్ని విక్రయించనున్నారు. అయితే ఈ ఫోన్ అధికారిక లాంఛ్, సేల్స్ వంటి వివరాల గురించి కంపెనీ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు.
కంపెనీ వెల్లడించిన స్పెసిఫికేషన్స్ ఇవే: ఈ ఫోన్ లాంఛ్‌కు ముందుగా కంపెనీ కొన్ని స్పెసిఫికేషన్లను వెల్లడించింది. వివో ఈ ఫోన్‌లో క్వాడ్- క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను అందించనుంది. ఇది 141 డిగ్రీల కర్వ్డ్ అండ్ స్లిమ్ బెజెల్స్‌తో వస్తుంది. దీంతోపాటు ఈ ఫోన్‌లో డైమండ్ షీల్డ్ గ్లాస్‌ను కూడా అందించనున్నట్లు వివో తెలిపింది. దీంతో ఈ ఫోన్ కిందపడిపోయినా భయపడాల్సిన అవసరం లేదని, దీని డిస్ప్లేకు అంత ఈజీగా ఏం కాదని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీతో IP68, IP69 సర్టిఫికేషన్‌తో వస్తుంది.
కలర్ ఆప్షన్స్:కంపెనీ ఈ ఫోన్‌ను మూడు కలర్ ఆప్షన్లతో రిలీజ్ చేయనుంది.
- టైటానియం గ్రే
- రోజ్ రెడ్
- స్టార్రీ బ్లూ