Redmi Watch 5 Lite Launched:ఈ స్మార్ట్ యుగంలో ఎప్పటికప్పుడు అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. కార్లు, బైక్‌లు, మొబైల్ ఫోన్స్ ఈ కోవలోకే వస్తాయి. ఎప్పటికప్పుడు ఇవి కొంగొత్త మెరుగులు దిద్దుకుని స్టైలిష్ లుక్‌లో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్మార్ట్‌వాచ్‌లు కూడా వీటికేం తీసిపోకుండా అదిరే ఫీచర్స్‌తో మనముందుకు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ Xiaomi సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.
అత్యాధునిక ఫీచర్లతో ఎట్రాక్టివ్ స్లీక్ మెటాలిక్ డిజైన్‌తో దీన్ని తీసుకొచ్చింది. సూర్యకాంతి ఎక్కువగా ఉన్న సమయంలోనూ ఈ స్మార్ట్‌వాచ్‌ను ఉపయోగించొచ్చు. దీంతోపాటు ఈ వాచ్ 5 ATM వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. 50 మీటర్ల లోతు నీటిలో 10 నిమిషాల వరకు దీన్ని ఉంచినా దీనికి ఎలాంటి డ్యామేజ్ కాదు. ఈ వాచ్‌ను పెట్టుకుని స్విమ్మింగ్‌తో పాటు ఇతర వాటర్ యాక్టివిటీస్‌లో పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు మీకోసం.
Redmi Watch 5 Lite Features:
- డిస్‌ప్లే: 1.96 అంగుళాల AMOLED
- బ్రైట్‌నెస్: 600 నిట్స్
- బ్యాటరీ: 470mAh
- హార్ట్ బీట్ సెన్సార్
- యాక్సిలరోమీటర్
- గైరోస్కోప్
- మైక్రోఫోన్
- స్పీకర్
- 2-mic ఫర్ కాల్స్
- ENC
- క్లాక్ ట్రాకింగ్
- స్లీప్ ట్రాకింగ్
- స్ట్రెస్ మానిటరింగ్
- పీరియడ్ సైకిల్ మానిటరింగ్
- 160+ స్పోర్ట్స్ మోడ్
- 50+ విడ్జెట్ కస్టమైజేషన్
- నైట్ మోడ్
- DND మోడ్
- థియేటర్ మోడ్
- వాటర్ క్లియరింగ్ మోడ్
- బ్లూటూత్ కాలింగ్
- నాయిస్ క్యాన్సిలేషన్
Redmi Watch 5 Liteలో కలర్ ఆప్షన్స్:ఈ Redmi Watch 5 Lite రెండు కలర్స్‌లో మార్కెట్లో అందుబాటులో ఉంది.
- బ్లాక్
- లైట్ గోల్డ్