Realme 14x 5G:రియల్మీ నుంచి సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. 'రియల్మీ 14x 5G' పేరుతో దీన్ని తీసుకురానున్నారు. ఈ ఫోన్ డిసెంబర్ 18న దేశీయ మార్కెట్లోకి రానుంది. అదిరే ఫీచర్లతో కేవలం రూ.15వేల లోపే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేయనుంది.
'రియల్మీ 12x' రిలీజ్ తర్వాత కంపెనీ '13x'ని దాటవేసి నేరుగా 'రియల్మీ 14x' ఫోన్‌ను లాంఛ్ చేయనుంది. రియల్మీ ఇప్పటికే ఈ 'రియల్మీ 14x' 5G ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లను వెల్లడించింది. ఇప్పుడు తాజాగా స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ, ఛార్జింగ్, ధర వివరాలను ప్రకటించింది.
కలర్ ఆప్షన్స్:
- బ్లాక్
- గోల్డ్
- కోరల్
45W స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీతోదీన్ని తీసుకొస్తున్నట్లు పేర్కొంది. 5G సెగ్మెంట్లో ఈ బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న మొదటి ఫోన్ ఇదే అని కంపెనీ తన అధికారిక సైట్‌లో తెలిపింది. ఈ ఫోన్ 38 నిమిషాల్లో 0 నుంచి 50శాతం వరకు ఛార్జ్ అవుతుందని, 100శాతం ఛార్జ్ చేయడానికి 93 నిమిషాలు పడుతుందని కంపెనీ తన పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఈ మొబైల్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే రెండు రోజుల పాటు పనిచేస్తుంది. ఫుల్ ఛార్జ్‌తో 45.4 గంటల పాటు కాల్స్ మాట్లాడుకోవచ్చు లేదా 15.8 గంటల పాటు వీడియోలను కంటిన్యూగా చూడొచ్చని కంపెనీ అంటోంది.
నీటిలో పడినా భయపడక్కర్లేదు!:ఈ ఫోన్ నీటిలో పడినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ అంటోంది. ఈ ఫోన్ డస్ట్ అండ్ వాటర్‌ప్రూఫ్‌తో IP69 రేటింగ్‌తో వస్తుందని తెలిపింది. ఈ రేటింగ్‌తో రూ.15వేల లోపు ధరలో వస్తున్న ఇండియాలోని మొట్ట మొదటి ఫోన్ కూడా ఇదే.