OpenAI Reveals Voice Engine :చాట్-జీపీటీని సృష్టించిన ఓపెన్ఏఐ ఇప్పుడు సరికొత్త 'ఆర్టిఫీషియల్ వాయిస్ అసిస్టెంట్'ను రూపొందించింది. దీని ద్వారా ఎవరి వాయిస్‌నైనా చాలా సులువుగా, వేగంగా క్లోనింగ్ చేసేయవచ్చు. అయితే దీనిని భద్రతా కారణాల రీత్యా పబ్లిక్‌గా విడుదల చేయడం లేదని ఓపెన్ ఏఐ వెల్లడించింది.
రిస్క్ ఎక్కువే!
ఓపెన్ఏఐ ఈ కొత్త 'వాయిస్ ఇంజిన్ టెక్నాలజీ'ని శుక్రవారం ఆవిష్కరించింది. వారం రోజుల క్రితమే దీని ట్రేడ్ మార్క్ కోసం అప్లై చేసింది కూడా. దీనితో కేవలం 15 సెకెన్లలోనే ఒక వ్యక్తి వాయిస్‌ను యథాతథంగా క్లోనింగ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. అయితే దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక దీనిని అందరికీ అందుబాటులోకి తేవడం లేదని ఓపెన్ఏఐ స్పష్టం చేసింది.
'ఈ న్యూ వాయిస్ అసిస్టెంట్‌తో వ్యక్తుల స్వరాలను క్లోనింగ్ చేయవచ్చు. ఇది ఎన్నికల సంవత్సరం. కనుక దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అందుకే దీనిని అందరికీ అందుబాటులోకి తేవడం లేదు'
- ఓపెన్ఏఐ
బైడెన్ వాయిస్ క్లోనింగ్
న్యూ హాంప్‌షైర్‌లో, యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ వాయిస్‌ను అనుకరిస్తూ ఒక ఏఐ వాయిస్‌ను రూపొందించారు. దీనిని ప్రెసిడెన్షియల్ ప్రైమరీ ఎలక్షన్స్‌కు ముందు వేలాది మంది ఓటర్లకు పంపించారు. దీనితో అప్రమత్తమైన అధికారులు, ఈ రోబోకాల్స్‌పై దర్యాప్తు జరుపుతున్నారు.
పాత టెక్నాలజీయే!
వాస్తవానికి అనేక స్టార్టప్ కంపెనీలు ఇప్పటికే వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీని మార్కెట్లో విక్రయిస్తున్నాయి. అయితే ఇవి ఎక్కువగా కొన్ని ఎంపిక చేసిన వ్యాపార సంస్థలకు, ఎంటర్టైన్మెంట్ స్టూడియోలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.