తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఫోన్ అప్పుడప్పుడు స్విఛ్ ఆఫ్ చేయాలా? ఎన్ని రోజులకు ఒకసారి? సెక్యూరిటీ ఎక్స్​పర్ట్స్​ మాటేంటి? - NSA PHONE USAGE TIPS

జస్ట్​ స్విఛ్ ​ఆఫ్ చేస్తే చాలు - హ్యాకర్స్ నుంచి మీ ఫోన్​​ సేఫ్​ - NSA ఎక్స్​పర్ట్స్​ చెప్పిన టిప్స్ ఇవే!

phone Switch Off
phone Switch Off (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2024, 11:16 AM IST

NSA Phone Usage Tips :మీ స్మార్ట్​ఫోన్ హ్యాకర్స్ బారిన పడకుండా సురక్షితంగా ఉండాలా? అయితే ఇది మీ కోసమే. మీ ఫోన్​ను సింపుల్​గా స్విఛ్ ఆఫ్ చేస్తే చాలు - హ్యాకర్స్ బారిన పడకుండా మీ ఫోన్ సేఫ్​గా ఉంటుందని అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ నిపుణులు చెబుతున్నారు. అయితే మనం ఎంత తరచుగా ఫోన్​ టర్న్ ఆఫ్​ చేయాలి? దీని వల్ల ఇంకా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మనలో చాలా మంది స్మార్ట్​ఫోన్ వాడుతూ ఉంటాం. కానీ దాని మెయింటెనెన్స్ గురించి ఏమాత్రం పట్టించుకోరు. వాస్తవానికి స్మార్ట్​ఫోన్​ అనేది మన జేబులో ఉన్న మినీ పర్సనల్ కంప్యూటర్ లాంటిది. దీనిని చక్కగా మెయింటైన్ చేస్తేనే, అది దీర్ఘకాలంపాటు చక్కగా పనిచేస్తుంది. హ్యాకర్స్ బారిన పడకుండా ఉంటుంది.

ఇలా చేయండి!
వారానికి కనీసం ఒక్కసారైనా మీ ఫోన్​ను పూర్తిగా టర్న్ ఆఫ్/ స్విఛ్​ ఆఫ్ చేయాలి. దీని వల్ల హానికరమైన (మలీషియస్)​ లింక్స్​ ద్వారా, జీరో-క్లిక్ ఎక్స్​ప్లోయిట్స్​ ద్వారా జరిగే హ్యాకింగ్​ను మీరు పూర్తిగా నిరోధించవచ్చు. దీని వల్ల మీ విలువైన డేటా సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకోకుండా కాపాడుకోగలుగుతారు. పైగా ఫోన్ టర్న్ ఆఫ్​ చేయడం వల్ల మీ మొబైల్​​ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది!

సాధారణంగా సైబర్ నేరగాళ్లు మీ మొబైల్​కు ఫోన్​ చేయడం లేదా హానికారకమైన లింక్​లను పంపించడం లాంటివి చేస్తుంటారు. వీటి ద్వారా మీ డివైజ్​లోకి మాల్​వేర్​లు, స్పైవేర్లు ఇన్​స్టాల్ అయిపోతాయి. క్రమంగా మీ ఫోన్​ హ్యాకర్ల అధీనంలోకి వెళ్లిపోతుంది. కానీ ఈ విషయం మీకు తెలియకుండా జరిగిపోతుంది. ఇలాంటి వాటిని సమర్థంగా అడ్డుకోవాలంటే, కచ్చితంగా మీ ఫోన్​ను రీబూట్​ చేయాల్సి ఉంటుంది. అప్పుడు హానికరమైన మాల్​వేర్లు, స్పైవేర్లు మీ ఫోన్ నుంచి తొలగిపోతాయి. అంతేకాదు రెగ్యులర్​గా రీబూట్ చేయడం వల్ల మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ స్మూత్​గా రన్​ అవుతుంది. అలాగే మిగతా యాప్స్ కూడా చక్కగా వర్క్ చేస్తాయి.

బోనస్ టిప్ ​: మీరు మీ ఫోన్​ను స్విఛ్ ఆఫ్ చేసి ఎంత కాలం అయ్యిందో తెలుసుకునే వీలు కూడా ఉంది. ఇందుకోసం మీ ఆండ్రాయిడ్​ ఫోన్​లోని సెట్టింగ్స్​లోకి వెళ్లండి. అక్కడ 'Device' అనే ఆప్షన్​పై క్లిక్ చేయండి. తరువాత 'Status'పై క్లిక్ చేయండి. అక్కడ మీకు డివైజ్​ అప్​టైమ్ మీకు కనిపిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details