IPhone 16 Series Launch Date :టెక్ దిగ్గజం యాపిల్ ఏటా కొత్త ఐఫోన్ సిరీస్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలో ఐఫోన్ 16 సిరీస్‌ను ఈ సెప్టెంబరు 10న మార్కెట్లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరెందుకు ఆలస్యం ఈ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల ధరలు, స్పెక్స్, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం పదండి.
సెప్టెంబర్ 10న ఐఫోన్ 16 సిరీస్ లాంఛ్ ఈవెంట్ జరగనుండగా, సెప్టెంబర్ 20 నుంచి ఫోన్లను అందుబాటులోకి రానున్నాయని సమాచారం. ఐఫోన్ 16 సిరీస్‌లో ఈసారి కూడా నాలుగు ఫోన్లు రిలీజ్ కానున్నాయి. స్టాండర్డ్ వేరియంట్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను యాపిల్ తీసుకురానుంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో రానున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్ 512జీబీ, 1టీబీ స్టోరేజ్ ఆప్షన్లలో రానున్నట్లు సమాచారం.
IPhone 16 Price :ఐఫోన్ 16 మోడల్ ఫోన్లు కింది ధరల్లో లభించనున్నట్లు తెలుస్తోంది.
- ఐఫోన్ 16 ధర - 799 డాలర్లు (రూ.67,100)
- ఐఫోన్ 16 ప్లస్ ధర -899 డాలర్లు (రూ.75,500)
- ఐఫోన్ 16 ప్రో ధర - 1,099 డాలర్లు (రూ.92,300)
- ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ - 1,199 డాలర్లు (రూ.1,00,700)
IPhone 16, IPhone 16 Plus Features :ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ 8జీబీ ర్యామ్‌తో, ఏ18 చిప్సెట్తో రావచ్చని అంచనా. ఐఫోన్ 16 ఫోన్ 6.1 అంగుళాల డిస్ప్లే , ఐఫోన్ 16 ప్లస్ 6.7 అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటాయని సమాచారం. ఐఫోన్ 16 స్టాండర్డ్ మోడల్ 3,561 mAh బ్యాటరీ, ప్లస్ మోడల్ 4,006 mAh బ్యాటరీతో రావచ్చని తెలుస్తోంది.
ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తాయని తెలుస్తోంది. ఈ సెటప్‌లో ఎఫ్/1.6 ఎపార్చర్, 2 ఎక్స్ జూమ్‌తో కూడిన 48 ఎంపీ ప్రైమరీ వైడ్ కెమెరా, ఎఫ్/2.2 ఎపార్చర్ 0.5 ఎక్స్ జూమ్‌తో కూడిన అల్ట్రా వైడ్ కెమెరా ఉండొచ్చని సమాచారం.