How to Operate Robot Vacuum Cleaners: మహిళలకు వంట పని తర్వాత ఇబ్బంది కలిగే పని అంటే ఇళ్లు క్లీనింగ్. ఎందుకంటే ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. సోఫా కింద, మంచం కింద, బీరువాల కింద వంగి ఊడవాలన్నా, తడిగుడ్డ పెట్టాలన్నా చాలా కష్టం. ఇక ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో ఒక పక్క ఉద్యోగాలు చేసుకుంటూ.. మరో పక్క పిల్లల్ని చూసుకోవడం, ఇంటి పనులు చేయడం అంటే పని భారం మామూలుగా ఉండదు. పని చేసే ఓపిక ఉన్నా సమయం ఉండదు. ఒక్కోసారి సమయం ఉన్నా.. పనులు చేసేందుకు ఓపిక ఉండదు. అయితే వీటన్నింటికి చెక్ పెట్టేందుకు మీకోసం ఒక అద్భుతమైన ప్రొడక్ట్ వచ్చేసింది. అదే "రోబో వ్యాక్యూమ్ క్లీనర్". మీరు రిమోట్‌తో ఆపరేట్ చేస్తే చాలు.. దాని పని అది చేసుకుంటుంది. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? దీని వల్ల ఏఏ పనులు పూర్తవుతాయి వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్లు, గిన్నెలు శుభ్రం చేయడానికి డిష్ వాషర్లు, ఇంటిని శుభ్రం చేయడానికి వ్యాక్యూమ్ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆల్రెడీ వాక్యూమ్ క్లీనర్లు ఉన్నాయి కాదా.. మళ్లీ ఈ రోబో క్లీనర్లు ఎందుకూ అనే డౌట్ మీకు రావచ్చు. అయితే వ్యాక్యూమ్ క్లీనర్లను మనం ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లోని దుమ్ము, చెత్తను తొలగించడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఇళ్లు తుడవాలంటే మాప్లు ఉపయోగించాల్సిందే. అదే ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. ఇది కూడా ఇంట్లోని దుమ్ము, చెత్తను తొలగించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీటిలోని పలు మోడల్స్ ఇల్లు ఊడ్చేసి తడిగుడ్డ కూడా పెట్టేస్తాయి.
ప్రయోజనాలు చూస్తే:
- ఆటోమెటిక్‌గా శుభ్రం చేయడం: సాధారణంగా వ్యాక్యూమ్ క్లీనర్ల వెంట మనం ఉండాల్సిందే. కానీ వీటికి మనం వెంట ఉండనవసరం లేదు. జస్ట్ ఆన్ చేస్తే చాలు ఇవి స్వయంగా ఇంటిని శుభ్రం చేస్తాయి.
- అన్ని రకాల నేలలపై పని చేస్తాయి:కార్పెట్లు, టైల్స్, లామినేట్ ఫ్లోరింగ్ వంటి అన్ని రకాల నేలలపై ఇవి సమర్థవంతంగా పని చేస్తాయి.
- చెత్తను సేకరించడం:చిన్న చిన్న ముక్కలు, జుట్టు, బిస్కెట్ ముక్కలు ఇలా ఒక్కటేమటి అన్ని రకాల చెత్తను సులభంగా సేకరించి అందులోనే స్టోర్ చేసుకుంటాయి. తర్వాత దాని నుంచి చెత్తను తీసివేస్తే సరి.
- షెడ్యూల్ చేయడం: మనం నచ్చిన సమయంలో ఆటోమేటిక్‌గా శుభ్రం చేయడానికి షెడ్యూల్ చేయవచ్చు.
- అధునాతన ఫీచర్లు: కొన్ని రోబో వాక్యూమ్ క్లీనర్లలో మ్యాపింగ్, వాయిస్ కమాండ్లు, అప్లికేషన్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి.
శత్రువులను ఖతం చేసే 'AI రోబో'- ఎనిమీ ఎక్కడ ఉన్నా గురితప్పదు! యుద్ధభూమిలో 360 డిగ్రీల కవరేజ్!