Free Online Tools For Daily Tasks :వెబ్ బ్రౌజర్లు ఒకప్పుడు చాలా స్లోగా ఉండేవి. వాటికి సపోర్ట్ చేసే ఆన్లైన్ యాప్స్ కూడా చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పూర్తిగా ఆన్లైన్లోనే ఎలాంటి పనులు అయినా చేయగలిగే పరిస్థితి ఏర్పడింది. నేడు వెబ్ బ్రౌజర్లకు యాడ్ చేసుకోగలిగే చాలా ఆన్లైన్ టూల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. వీటిని మీరు డౌన్‌లౌడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం బ్రౌజర్‌లోనే వీటిని ఉపయోగించుకోవచ్చు. అయితే వీటిలో కొన్ని పెయిడ్ యాప్స్ కాగా, మరికొన్ని ఫ్రీ యాప్స్.
మీరు విండోస్ పీసీలో వర్క్ చేస్తున్నా, లేదా మ్యాక్ ఓఎస్‌లో బ్రౌజ్ చేస్తున్నా ఫర్వాలేదు. ఈ రెండింటికీ సపోర్ట్ చేసే బెస్ట్ ఆన్లైన్ టూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇవన్నీ ఫ్రీ!
1. ILovePDF : ఇది ఒక ఫ్రీ ఆన్లైన్ టూల్. దీనిని మీ సిస్టమ్‌లో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పనికూడా లేదు. పైగా ఇది పూర్తిగా ఉచితం. ఈ టూల్ ఉపయోగించి మీ వర్డ్ డాక్యుమెంట్లను చాలా సులువుగా పీడీఎఫ్ ఫైల్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఉన్న పీడీఎఫ్‌లను కంప్రెస్, మెర్జ్, స్ల్పిట్ చేసుకోవచ్చు. మీ పీడీఎఫ్‌లను ఎడిట్ కూడా చేసుకోవచ్చు.
2. Giphy :ఈ ఆన్లైన్ టూల్ ఉపయోగించి రకరకాల జిఫ్ (GIF) ఫైల్స్, స్టిక్కర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనిలో మీకు కావాల్సిన ఇమేజ్ అప్లోడ్ చేసి, దానిని జిఫ్ ఫైల్‌గా కన్వర్ట్ చేయవచ్చు. లేదా ఏదైనా వీడియో యూఆర్ఎల్ లింక్ పేస్ట్ చేసి, దాని ఆధారంగా కూడా జిఫ్ ఫైల్స్ తయారు చేయవచ్చు.
3. Imageresizer : మన కంప్యూటర్లో ఉన్న ఇమేజ్‌లు చాలా పెద్దసైజులో ఉంటాయి. కనుక వీటిని ఆన్లైన్లో ఇతరులకు పంపడం కాస్త కష్టం అవుతుంది. అందుకే వాటి సైజ్‌ను (MB నుంచి KB) ల్లోకి మార్చాలి. ఇలా మార్చేందుకు ఉపయోగపడేదే ఈ Image compressor టూల్.
4. ZIP Extractor : సాధారణంగా జిప్ ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే, అందుకోసం సాఫ్ట్‌వేర్స్‌ను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అయితే ZIP Extractor టూల్‌తో ఆన్లైన్లోనే చాలా ఈజీగా జిప్ ఫైల్‌ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు.
5. Qrcodemonkey :ఒకప్పుడు క్యూఆర్ కోడ్ క్రియేట్ చేయాలంటే, టెక్నికల్ సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరమే లేదు. సింపుల్‌గా ఈ క్యూఆర్కోడ్మంకీ టూల్ ఉపయోగించి, మీకు కావాల్సిన క్యూఆర్ కోడ్‌ను ఆన్లైన్లోనే క్రియేట్ చేసుకోవచ్చు.