తెలంగాణ

telangana

రూ.50వేల బడ్జెట్లో మంచి గేమింగ్ ల్యాప్​టాప్ కొనాలా? టాప్​-6 ఆప్షన్స్​ ఇవే! - Best Laptops Under 50000

By ETV Bharat Telugu Team

Published : Aug 18, 2024, 3:29 PM IST

Best Laptops Under 50000 : మీరు మంచి ల్యాప్​టాప్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.50,000 మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. విద్యార్థులు, ఉద్యోగులకే కాకుండా, గేమ్స్​ ఆడేవారికి కూడా బాగా ఉపయోగపడే టాప్​-6 ల్యాప్​టాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

laptops under 50k
Best laptops under Rs50000 (ETV Bharat)

Best Laptops Under 50000 :ప్రస్తుత కాలంలో విద్యార్థులకు, ఉద్యోగులకు ల్యాప్​టాప్ తప్పనిసరి అయిపోయింది. మరీ ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలైన తర్వాత ల్యాప్​టాప్​ల వినియోగం మరింత పెరిగిపోయింది. ఇంజినీరింగ్, సాంకేతిక కోర్సులు చదివే విద్యార్థులకు ల్యాప్​టాప్ తప్పనిసరి. ఇక ఆన్​లైన్ గేమ్స్ ఆడేవారికి హెవీ గ్రాఫిక్స్​ను సపోర్ట్​ చేసే​ ల్యాప్​టాప్ ఉండాలి. అందుకే ఈ ఆర్టికల్​లో రూ.50వేల బడ్జెట్లో వీరందరికీ ఉపయోగపడే, మంచి పెర్ఫార్మెన్స్, స్పీడ్, పోర్టబిలిటీ ఉన్న టాప్​-6 ల్యాప్​టాప్స్ గురించి తెలుసుకుందాం.

1. HP Laptop 15s, AMD Ryzen 5 5500U :ఈ హెచ్​పీ ల్యాప్​టాప్ 15.6 అంగుళాల ఎఫ్​హెచ్​డీ డిస్​ప్లేతో వస్తుంది. 8జీబీ డీడీఆర్4 ర్యామ్, 512జీబీ ఎస్ఎస్​డీ స్టోరేజీతో లభిస్తుంది. ఈ ల్యాప్​టాప్ ధర రూ.36,990 వరకు ఉంటుంది. లో లెవల్​ గ్రాఫిక్స్​తో గేమ్స్ అడేవాళ్లకు ఇది మంచి ఆప్షన్ అవుతుంది. విద్యార్థులకు, ఉద్యోగులకు, మల్టీ టాస్కింగ్ చేసేవారికి అయితే ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది.

  • ప్రాసెసర్ : ఏఎమ్​డీ రైజెన్ 5 5500యూ
  • డిస్​ప్లే : 15.6 అంగుళాల ఎఫ్​హెచ్​డీ
  • ర్యామ్ : 8జీబీ డీడీఆర్4
  • స్టోరేజ్ : 512 జీబీ ఎస్ఎస్​డీ
  • గ్రాఫిక్స్ : ఏఎమ్​డీ రేడియన్ గ్రాఫిక్స్

2. HP Laptop 15s, 12th Gen Intel Core i3 :ఈ హెచ్​పీ ల్యాప్​టాప్ధర రూ.37,990 వరకు ఉంటుంది. డ్యూయల్ స్పీకర్​లతో ఈ ల్యాప్​టాప్ లభిస్తుంది. ఇది చాలా తేలికగా, రొబస్ట్​ బిల్ట్​ క్వాలిటీ కలిగి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మల్టీ టాస్కింగ్ కోసం ఈ ల్యాప్​టాప్ సరిగ్గా సరిపోతుంది.

  • ప్రాసెసర్ : 12 జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3-1215యూ
  • డిస్​ప్లే : 15.6 అంగుళాల ఎఫ్​హెచ్​డీ
  • ర్యామ్ : 8జీబీ డీడీఆర్4
  • స్టోరేజ్ : 512 జీబీ ఎస్ఎస్​డీ
  • గ్రాఫిక్స్ : ఇంటెల్ యూహెచ్​డీ గ్రాఫిక్స్
  • కీబోర్డ్ : బ్యాక్​లిట్​
  • వెయిట్ : థిన్ అండ్ లైట్

3. Dell 14 Thin & Light Laptop : ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి ఈ డెల్ ల్యాప్​టాప్​ బాగా ఉపయోగపడుతుంది. దీని బరువు కేవలం 1.48 కేజీలు. కనుక దీనిని ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ ల్యాప్​టాప్ ధర రూ.46,990 వరకు ఉంటుంది. అలాగే ఈ ల్యాప్​టాప్​లో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, మైక్రోసాఫ్ట్​ ఆఫీస్ 2021 ఉంటుంది. అంతేకాదు 15 నెలలపాటు McAfee సబ్​స్క్రిప్షన్​ కూడా ఉచితంగా లభిస్తుంది.

  • ప్రాసెసర్ : 12 జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5-1235యూ
  • డిస్​ప్లే : 14 అంగుళాల ఎఫ్​హెచ్​డీ
  • ర్యామ్ : 8జీబీ డీడీఆర్4
  • స్టోరేజ్ : 512 జీబీ ఎస్ఎస్​డీ
  • గ్రాఫిక్స్ : ఇంటెల్ యూహెచ్​డీ గ్రాఫిక్స్
  • కీబోర్డ్ : స్పిల్ రెసిస్టెంట్
  • కలర్ : బ్లాక్

4. Lenovo IdeaPad :ఈ ల్యాప్​టాప్ మల్టీ టాస్కింగ్​కు, వెబ్​బ్రౌజింగ్​కు చాలా బాగుంటుంది. కనుక విద్యార్థులు, ఉద్యోగులు దీనిపై ఓ లుక్కేయవచ్చు. దీనిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్​ కూడా ఉంటుంది. ఆన్​లైన్ గేమ్స్ ఆడేవారికి ఇలా చాలా బాగుంటుంది. ఈ ల్యాప్​టాప్ బరువు 1.63 కేజీలు. దీని ధర రూ.35,490 వరకు ఉంటుంది.

  • ప్రాసెసర్ : 11 జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3
  • డిస్​ప్లే : 15.6 అంగుళాలు
  • ర్యామ్ : 8జీబీ
  • స్టోరేజ్ : 512 జీబీ ఎస్ఎస్​డీ
  • ఆపరేటింగ్ సిస్టమ్ : విండోస్ 11

5. HP Laptop 15s, AMD Ryzen 3 5300U :ఈ ల్యాప్​టాప్ విద్యార్థులు, ఉద్యోగులు, గేమర్స్​ అందరికీ బెస్ట్ ఆప్షన్​ అవుతుంది. ఇందులో ఉన్న 15.6 అంగుళాల హెచ్​డీ డిస్​ప్లే స్పష్టమైన విజువల్స్​ను అందిస్తుంది. దీనిలో డ్యూయెల్ ఆడియో స్పీకర్లు ఉంటాయి. ఈ ల్యాప్​టాప్ బరువు 1.69 కేజీలు. దీని ధర రూ.29,990 వరకు ఉంటుంది.

  • ప్రాసెసర్ : ఏమ్​డీ రైజెన్ 3 5300యూ
  • డిస్​ప్లే : 15.6 అంగుళాలు
  • ర్యామ్ : 8 జీబీ
  • స్టోరేజ్ : 512 జీబీ ఎస్ఎస్​డీ
  • కలర్ : సిల్వర్
  • ఓఎస్ : విండోస్ 11

6. Acer Aspire Lite, AMD Ryzen 5 5500U :ఈ ల్యాప్​ట్యాప్ మల్టీ టాస్కింగ్ చేసేవారికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీని ధర రూ.33,000. కేవలం 1.59 కేజీల బరువున్న ఈ ల్యాప్​టాప్​ను చాలా సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.

  • ప్రాసెసర్ : ఏఎండీ రైజెన్ 5 5500యూ
  • డిస్​ప్లే : 15.6 అంగుళాల ఫుల్ హెచ్​డీ
  • ర్యామ్ : 8జీబీ
  • స్టోరేజ్ : 512 జీబీ ఎస్ఎస్​డీ
  • కలర్ : స్టీల్ గ్రే
  • ఓఎస్ : విండోస్ 11
  • ఆడియో : డ్యూయల్ స్పీకర్స్


మీ ఫోన్‌ తరచూ హ్యాంగ్‌ అవుతోందా? ఈ టిప్స్‌ ట్రై చేయండి! - How To Fix Phone Hanging Issue

స్పామ్ కాల్స్​/మెసేజ్​లతో విసిగిపోయారా? ట్రాయ్ DND యాప్​లో ఫిర్యాదు చేయండిలా! - How To Complain About Spam Calls

ABOUT THE AUTHOR

...view details