Best Mobile Phones Under 15000: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వాడకం సర్వసాధారణం అయిపోయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. అత్యధికంగా మొబైల్స్ అమ్ముడవుతున్న నేపథ్యంలో అన్ని కంపెనీలు మార్కెట్‌కు అనుగుణంగా సరికొత్త స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేయడానికి ఉత్సాహం కనబరుస్తున్నాయి.
కేవలం రూ.15వేల లోపు ఫ్రెడ్లీ బడ్జెట్లో ప్రతి నెలా కనీసం 2 నుంచి 4 మోడల్స్‌లో స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో కొత్త ఫోన్ కొనాలనే ఆలోచనలో ఉన్న కస్టమర్లు ఏ ఫోన్ ఎంచుకోవాలో తెలియక చాలా తికమక పడుతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ బడ్జెట్లో మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy M34 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung కంపెనీ తన కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో Samsung Galaxy M34 5G అనే 'M' సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసింది.
ఫీచర్లు
- డిస్ప్లే : 6.5 అంగుళాలు
- ప్రాసెసర్ : ఎక్సినాస్ 1280 చిప్సెట్
- ర్యామ్ : 6 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
- బ్యాటరీ : 6,000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 13 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- ధర : రూ.13,888
Redmi Note 13 5G:మార్కెట్లో Redmi నోట్ సిరీస్ఫోన్లు అత్యుత్తమ ఫీచర్లతో తక్కువ ధరకు లభిస్తున్నాయి. దీంతో ఈ స్మార్ట్ ఫోన్లను కొనేందుకు యూజర్స్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే Redmi Note 13 5G ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది.