తెలంగాణ

telangana

ETV Bharat / technology

అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లకు షాక్.. డివైజ్​ల వాడకంపై పరిమితి! - AMAZON PRIME VIDEO

యూజర్లకు అలర్ట్.. అమెజాన్ ప్రైమ్ వీడియో కొత్త రూల్స్ చూశారా?

Amazon Prime video
Amazon Prime video (Photo Credit- Amazon)

By ETV Bharat Tech Team

Published : Dec 22, 2024, 8:01 PM IST

Amazon Prime video:ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియో తన యూజర్లకు షాకిచ్చింది. వచ్చే ఏడాది నుంచి డివైజ్​ల వాడకంలో పరిమితిని విధించనున్నట్లు ప్రకటించింది. మన దేశంలో ఎక్కువగా వినియోగించే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అమెజాన్‌కు చెందిన ప్రైమ్‌ వీడియో ఒకటి. ఓటీటీ బెనిఫిట్స్​తో పాటు అమెజాన్ ఇ-కామర్స్ సేవలు కూడా అందిస్తున్న విషయం తెలిసిందే.

ప్రైమ్ మెంబర్లు షాపింగ్ చేస్తే కేవలం ఒకరోజులోనే డెలివరీలను అందిస్తుంది. ఇలా ఓటీటీతో పాటు షాపింగ్‌ ప్రయోజనాలు కూడా లభిస్తుండడంతో చాలామంది దీన్ని వినియోగిస్తుంటారు. అయితే చాలామంది ఒక అకౌంట్‌ తీసుకుని పలువురు ఈ సర్వీసులను పొందుతున్నారు. దీంతో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకు సంబంధించి తన టర్మ్స్‌ను సవరించాలని నిర్ణయించి డివైజ్‌ల వాడకంపై పరిమితి విధించింది.

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌ వీడియో యూజర్లు ఒకేసారి 5 డివైజ్​లను వాడుకోవచ్చు. ఏ డివైజ్‌ అన్నది సంబంధం లేకుండా వీడియోలను చూడొచ్చు. అయితే అమెజాన్.. డివైజుల సంఖ్యను అలాగే ఉంచి, టీవీల సంఖ్యపై పరిమితి విధించింది. ఒకేసారి రెండు కంటే ఎక్కువ టీవీల్లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోను వాడాల్సివస్తే కొత్త కనెక్షన్‌ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. జనవరి నుంచి ఈ మార్పు అమల్లోకి రానుందని పేర్కొంది.

ఈ మేరకు అమెజాన్ ఇందుకు సంబంధించిన సమాచారంతో యూజర్లకు ఇ-మెయిల్స్‌ పంపించడం ఇప్పటికే ప్రారంభించింది. సెట్టింగ్స్‌ పేజీలోని మేనేజ్‌ ఆప్షన్‌ ద్వారా డివైజులను మేనేజ్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం అమెజాన్ వార్షిక మెంబర్‌షిప్ ధర రూ.1499గా ఉంది. త్రైమాసికానికైతే రూ.599, నెలకైతే రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మెంబర్‌షిప్‌ తీసుకోవడం ద్వారా ఎలాంటి యాడ్స్​ లేకుండానే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడొచ్చు.

దీంతోపాటు కంపనీ రూ.799 చెల్లిస్తే ఏడాది పాటు ప్రైమ్‌లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునే సదుపాయం కూడా అందిస్తోంది. అయితే ఇందులో యాడ్స్​ వస్తాయి. ఇక స్ట్రీమింగ్‌తో సంబంధం లేకుండా కేవలం షాపింగ్‌ బెనిఫిట్స్ మాత్రమే కావాలనుకుంటే ఏడాదికి రూ.399 చెల్లించి షాపింగ్‌ ఎడిషన్‌ సబ్‌స్క్రిప్షన్‌నూ తీసుకోవచ్చు.

కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ వార్నింగ్​.. ఇకపై అలాంటి టైటిల్స్, థంబ్​నెయిల్స్​ పెడితే చర్యలు తప్పవ్!

శాంసంగ్ లవర్స్​కు గుడ్​న్యూస్- అధిక ర్యామ్ కెపాసిటీతో 'గెలాక్సీ S25' సిరీస్- రిలీజ్ ఎప్పుడంటే?​

కళ్లు చెదిరే లుక్​లో లగ్జరీ రేంజ్​ రోవర్ స్పోర్ట్​- రూ.5లక్షలు పెరిగిన ధర- ఇప్పుడు ఈ కారు రేటెంతంటే?

ABOUT THE AUTHOR

...view details