YSRCP Social Media Activist Rajasekhar Reddy Arrested in Guntur :వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్లో ఉన్న ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తను నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన రాజశేఖర్ రెడ్డి హోంమంత్రి అనితపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టాడు.
అంబటి హింట్ - 'నా ఇంట్లోనే ఉన్నాడు వచ్చి అరెస్టు చెయ్యండి' - షాకిచ్చిన పోలీసులు - YSRCP SOCIAL MEDIA ACTIVIST ARREST
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్‌రెడ్డి అరెస్టు
ysrcp_social_media_activist_rajasekhar_reddy_arrested_in_guntur (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 13, 2024, 12:37 PM IST
దీనిపై నూజివీడు కేసు నమోదు చేసిన పోలీసులు రాజశేఖర్ రెడ్డి కోసం కొన్ని రోజులుగా వెదుకుతున్నారు. నకరికల్లులో రాజశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లి సోదాలు చేశారు. ఈ క్రమంలోనే రాజశేఖర్ రెడ్డి తమ ఇంట్లోనే ఉన్నాడని అంబటి రాంబాబు మీడియా ముఖంగా చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన నూజివీడు పోలీసులు గుంటూరులోని అంబటి రాంబాబు ఇంట్లో ఉన్న రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేసి పట్టుకొచ్చారు.