ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగనన్న పాలనలో మహిళలకు రక్షణ లేదు - వైఎస్సార్సీపీ సర్పంచ్ భార్య ఆవేదన - Sarpanch wife on social media

YSRCP Leaders Harassing Sarpanch Wife: స్వంతపార్టీ నేతలే తమను సామాజిక మాద్యమాల ద్వారా వేధిస్తున్నారంటూ సర్పంచ్ భార్య సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్​గా మారింది. వైఎస్సార్సీపీలో మహిళలకు రక్షణ లేదంటూ చిత్తూరు జిల్లా మొరసనపల్లె వైఎస్సార్సీపీ సర్పంచ్ జగదీష్ భార్య లీలావతి ఆరోపించింది. మహిళలకు జరిగే అవమానాలపై సజ్జల జవాబు చెప్పాలని లీలావతి డిమాండ్ చేసింది.

YSRCP Leaders Harassing Sarpanch Wife
YSRCP Leaders Harassing Sarpanch Wife

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 14, 2024, 9:14 PM IST

YSRCP Leaders Harassing Sarpanch Wife:అధికార పార్టీ సర్పంచ్ భార్యకు సైతం సామాజిక మాధ్యమంలో వైఎస్సార్సీపీ శ్రేణుల నుంచి వేధింపులు తప్పడం లేదు. అధికార పార్టీ నేతల అక్రమాలను ప్రశ్నించినందుకు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం మొరసనపల్లె పంచాయతీ వైఎస్సార్సీపీ సర్పంచ్ జగదీష్ భార్య లీలావతికి వేధింపులు ఎక్కువయ్యాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల ద్వారా తనను అసభ్య పదజాలంతో వేధింపులకు గురి చేస్తున్నారని సర్పంచ్ భార్య లీలావతి విడుదల చేసిన వీడియో వైరల్​గా మారింది.

వైరల్​గా మారిన లీలావతి వీడియో:తనను లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్య పదజాలంతో వేధింపులకు గురి చేస్తున్నారని సర్పంచ్ భార్య ఆరోపించారు. తనను తన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని లీలావతి వీడియోలు విడుదల చేశారు. తన గురించి స్థానిక నాయకులు, కార్యకర్తలు సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు, మందు పంపిణీ చేసి వైఎస్సార్సీపీ నేతలు తనపై కామెంట్లు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ భార్యగా తన లాంటి వాళ్లకే ఇలాంటి అవమానాలు ఎదురైతే, ఇక సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని లీలావతి ఆవేదన వ్యక్తం చేశారు. నిజం మాట్లాడితే తమపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చామని అనిపిస్తుందని తెలిపారు.

స్పందించిన కుప్పం టీడీపీ మహిళా విభాగం: వైఎస్సార్సీపీలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేవని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారని, ఈ ఘటనపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. కుప్పం వైఎస్సార్సీపీ ఇంచార్జ్, ఎమ్మెల్సీ భరత్ వర్గానికి చెందిన నాయకులు తనపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని లీలావతి ఆరోపించారు. లీలావతి వీడియో వైరల్ కావడంతో కుప్పం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షురాలు అనసూయ స్పందించారు. వైఎస్సార్సీపీలో అన్యాయాలను ప్రశ్నించే మహిళలను ఈ విధంగా వేధిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారి పార్టీ నాయకులు మహిళలను అన్ని విధాల వేధిస్తూ, ప్రతిపక్షాలపై బురద చెల్లి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

'గీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారాలు' - ఐటీడీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన

గీతాంజలి ఘటనపై స్పందించిన అధికార పార్టీ నేతలు, స్వంత పార్టీకి చెందిన వారు ఆరోపణలు చేస్తున్నా స్పందించడం లేదు. ఈ అంశంపై సీఎం జగన్ ఏం సమాధానం చెప్పాలి. వైఎస్సార్సీపీ అక్రమాలపై ప్రశ్నిస్తే, సామాజిక మాద్యమాల ద్వారా దాడులు చేస్తున్నారు. తల్లిని, చెల్లిని తరిమికొట్టిన సీఎం మహిళలకు ఏం న్యాయం చేయగలరు.-అనసూయ, తెలుగుదేశం మహిళా విభాగం నేత

ఆడబిడ్డ చావుపైనా జగన్ రెడ్డి రాజకీయాలు చేయడం దుర్మార్గం: వంగలపూడి అనిత

ABOUT THE AUTHOR

...view details